News November 21, 2024
డిసెంబర్ తొలి వారంలో అసెంబ్లీ సమావేశాలు?
TG: అసెంబ్లీ శీతాకాల సమావేశాలను డిసెంబర్ మొదటి వారంలో నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. సమావేశాల్లో కీలక బిల్లులకు ఆమోదం తెలపడంతో పాటు మూసీ పునరుజ్జీవం సహా పలు అంశాలపై చర్చించే అవకాశం ఉంది. OCT చివరి వారంలోనే అసెంబ్లీ సెషన్ జరగాల్సి ఉండగా, స్పీకర్, మండలి ఛైర్మన్ విదేశీ పర్యటనకు వెళ్లడంతో వాయిదా పడింది. కాగా ప్రత్యేక ఆహ్వానితులుగా MPలనూ సభకు పిలవాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం.
Similar News
News November 23, 2024
26న మహారాష్ట్ర సీఎంగా ఫడణవీస్ ప్రమాణం?
మహారాష్ట్ర సీఎంగా ఫడణవీస్ ఖరారైనట్లు వార్తలొస్తున్నాయి. ఆయన ఈనెల 26న ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఫడణవీస్ నాగ్‌పూర్ సౌత్ వెస్ట్ నుంచి ఆధిక్యంలో ఉండగా ఇప్పటికే ఆయన ఇంట్లో సంబరాలు మొదలయ్యాయి. ఆయనతో మహారాష్ట్ర బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు చంద్రశేఖర్ తాజాగా భేటీ అయ్యారు.
News November 23, 2024
3.1 లక్షలు దాటిన ప్రియాంక మెజార్టీ
వయనాడ్‌లో ప్రియాంక గాంధీ మెజార్టీ 3 లక్షలు దాటింది. కాసేపటి క్రితం ఆమె 3.1 లక్షల మెజార్టీలో ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. తన సోదరుడు రాహుల్ ఇదే స్థానంలో గతంలో 4 లక్షల మెజార్టీ సాధించగా ఆ రికార్డును ప్రియాంక బ్రేక్ చేస్తారని హస్తం నేతలు చెబుతున్నారు.
News November 23, 2024
ఓట్లు పెరిగితే BJP+ సీట్లు పెరుగుతాయ్!
మహారాష్ట్ర ఎన్నికల్లో ఓటింగ్ పర్సంటేజీ పెరిగేకొద్దీ NDA సీట్లు పెరుగుతున్నాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 61.4 ఓటింగ్ నమోదైంది. ఈసారి అది 65%కు చేరుకుంది. 2024 లోక్‌సభ పోలింగ్ 61%తో పోలిస్తే ఇది ఎంతో ఎక్కువ. మహారాష్ట్రలో BJP 9, శివసేన 7, NCP 1 సీటే గెలిచాయి. కాంగ్రెస్ 13, SSUBT 9, NCPSP 8 సీట్లు కైవసం చేసుకున్నాయి. ఈ లెక్కన MVAకు 153, NDAకు 126 రావాలి. అయితే ఇప్పుడు NDA 220 సీట్లు గెలిచేలా ఉంది.