News November 21, 2024

బాబోయ్.. చలి వణికిస్తోంది

image

TG: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు వేగంగా పడిపోతున్నాయి. సాధారణం కంటే 2-4 డిగ్రీల సెల్సియస్ వరకు తక్కువ నమోదవుతున్నాయి. ఒకవైపు ఉష్ణోగ్రతలు తగ్గడం, మరోవైపు రాష్ట్రానికి తూర్పు, ఈశాన్యం నుంచి తక్కువ ఎత్తులో బలమైన గాలులు వీస్తుండటంతో చలి తీవ్రత మరింత పెరిగింది. వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు రావడంతో ప్రజలు జ్వరాలు, జలుబు, దగ్గు వంటి అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు.

Similar News

News November 23, 2024

అమెరికా టీవీ ఛానల్ కొనుగోలు చేయనున్న మస్క్?

image

అపర కుబేరుడు ఎలాన్ మస్క్ అమెరికాకు చెందిన ప్రముఖ న్యూస్ ఛానల్ MSNBCని కొనుగోలు చేయనున్నట్లు వార్తలొస్తున్నాయి. MSNBC అమ్మకానికి ఉందన్న ఓ పోస్టుకు జూనియర్ ట్రంప్ స్పందిస్తూ మస్క్‌ను అడిగారు. దీనిని ఎంతకు అమ్ముతున్నారంటూ ఆయన రిప్లై ఇచ్చారు. ప్రముఖ పాడ్‌కాస్టర్ జో రోగన్ కూడా ఇది ఓకే అయితే తాను ఓ షో చేస్తానని చెప్పడంతో దీనిని తప్పకుండా చేయాలంటూ జూ.ట్రంప్ చెప్పడంతో డీల్ డన్ అంటూ మస్క్ హామీ ఇచ్చారు.

News November 23, 2024

వైసీపీకి మరో ఎమ్మెల్సీ గుడ్ బై

image

AP: వైసీపీ ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఎమ్మెల్సీ పదవికి, వైసీపీ సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను మండలి ఛైర్మన్‌ మోషేను రాజుకు పంపారు. కాగా కైకలూరుకు చెందిన వెంకటరమణ గతంలో టీడీపీలో పనిచేశారు. గత ఎన్నికలకు ముందు ఆయన వైసీపీలో చేరి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆ ఎన్నికల్లో పార్టీ ఓడిపోవడంతో ఆయన సైలెంట్ అయ్యారు.

News November 23, 2024

ఝార్ఖండ్‌లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులు

image

ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి స్పష్టమైన ఆధిక్యంతో దూసుకెళ్తోంది. JMM-కాంగ్రెస్ మిత్రపక్షాలు అధికారం చేపట్టడానికి అవసరమైన 41 స్థానాల మేజిక్ ఫిగర్‌ను దాటేశాయి. ప్రస్తుతం 51 సీట్లలో లీడింగ్‌లో ఉన్నాయి. అయితే ఈనెల 20న వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ఝార్ఖండ్‌లో కమలం వికసిస్తుందని జోస్యం చెప్పాయి. మై యాక్సిస్ ఇండియా మినహా అన్ని సంస్థలూ NDAకే పట్టం కట్టాయి. కానీ ఇవాళ ఆ అంచనాలన్నీ తలకిందులయ్యాయి.