News November 21, 2024

బాబోయ్.. చలి వణికిస్తోంది

image

TG: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు వేగంగా పడిపోతున్నాయి. సాధారణం కంటే 2-4 డిగ్రీల సెల్సియస్ వరకు తక్కువ నమోదవుతున్నాయి. ఒకవైపు ఉష్ణోగ్రతలు తగ్గడం, మరోవైపు రాష్ట్రానికి తూర్పు, ఈశాన్యం నుంచి తక్కువ ఎత్తులో బలమైన గాలులు వీస్తుండటంతో చలి తీవ్రత మరింత పెరిగింది. వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు రావడంతో ప్రజలు జ్వరాలు, జలుబు, దగ్గు వంటి అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు.

Similar News

News March 9, 2026

నా కొడుకు సెంచరీ ముఖ్యం కాదు: సంజూ తండ్రి

image

భారత్ ప్రపంచకప్ గెలవడం ఆనందంగా, గర్వంగా ఉందని సంజూ శాంసన్ తండ్రి విశ్వనాథ్ తెలిపారు. ‘సంజూ కోసం దేశంలో చాలా మంది ప్రార్థించారు. ఇప్పుడు వారంతా సంతోషంగా ఉంటారు. సెమీఫైనల్లో 250 రన్స్ చేసినా మనం 6-7 రన్స్ తేడాతోనే గెలిచాం. నా కొడుకు సెంచరీ ముఖ్యం కాదు. దాని కోసం 1-2 బాల్స్ కూడా మిస్ చేయకూడదు’ అని చెప్పారు.

News March 9, 2026

‘కల్కి’ కోసం కమల్ హాసన్‌కు రోజుకు ₹15 కోట్లు?

image

‘కల్కి 2898 AD’ సినిమాలో సుప్రీమ్ యాష్కిన్ పాత్ర పోషించిన కమల్ హాసన్ రెమ్యునరేషన్‌పై SMలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆయన కేవలం 10 రోజుల షూటింగ్ కోసం ఏకంగా ₹150 కోట్లు తీసుకున్నారని నటుడు యుగి సేతు అన్నారు. అంటే రోజుకు దాదాపు ₹15 కోట్లు అన్నమాట. అయితే చిత్ర బృందం మాత్రం దీన్ని కొట్టిపారేసినట్లు సమాచారం. ఇది రూమర్ మాత్రమేనని.. కమల్ పారితోషికం ఇంత భారీ స్థాయిలో ఉండదని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

News March 9, 2026

బ్లాక్ మార్కెట్లో సిలిండర్ ధర ₹1500

image

ఇరాన్ యుద్ధం కారణంగా భారత్‌లో LPG సిలిండర్లకు డిమాండ్ పెరిగింది. కొన్ని చోట్ల (UP) బ్లాక్ మార్కెట్‌లో ధర ₹1,500కు చేరింది. యుద్ధం నేపథ్యంలో మార్చి 7న డొమెస్టిక్ సిలిండర్ ధర ₹60 పెరగడంతో ప్రజలు భయంతో పానిక్ బయింగ్ మొదలుపెట్టారు. దీనివల్ల గ్యాస్ ఏజెన్సీల ముందు భారీ క్యూలు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితిని అరికట్టేందుకు ప్రభుత్వం 2 సిలిండర్ బుకింగ్‌ల మధ్య 25 రోజుల గ్యాప్ ఉండాలనే రూల్ తీసుకొచ్చింది.