News November 21, 2024
PM కిసాన్, PM ఆవాస్ పేరుతో మోసాలు
TG: PM కిసాన్, PM ఆవాస్ యోజన పేరుతో వచ్చే SMSలను నమ్మవద్దని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కోరింది. సైబర్ నేరగాళ్లు ఈ పథకాల పేర్లతో నకిలీ SMSలు పంపి మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించింది. APK ఫైల్స్ పంపి, వాటి ద్వారా పథకంలో చేరాలని చెబితే ఆ లింక్స్ క్లిక్ చేయవద్దని సూచించింది. తెలియని వ్యక్తుల నుంచి APK ఫైల్స్ వస్తే ఓపెన్ చేయవద్దని హెచ్చరించింది. అనుమానం వస్తే 1930కి కాల్ చేయాలంది.
Similar News
News December 3, 2024
రెడ్ సీ ఫెస్టివల్‌లో ఆమిర్ ఖాన్‌కు సన్మానం
సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరిగే రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్‌కు సన్మానం జరగనుంది. హాలీవుడ్ నటి ఎమిలీ బ్లంట్‌తో పాటు ఆమిర్‌ను సత్కరించనున్నట్లు ఫెస్టివల్ నిర్వాహకులు ట్విటర్‌లో తెలిపారు. ఈ నెల 5 నుంచి 14 వరకు ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నారు. హాలీవుడ్ నటులు ఆండ్రూ గార్ఫీల్డ్, ఈవా లాంగోరియా, బాలీవుడ్ నుంచి కరీనా కపూర్, రణ్‌బీర్ ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.
News December 3, 2024
RECORD: 18 ఏళ్లకే కమర్షియల్ పైలట్
కమర్షియల్ పైలట్ లైసెన్స్ పొందిన అత్యంత పిన్నవయస్కురాలిగా కర్ణాటకలోని విజయపురకు చెందిన సమైరా హుల్లుర్ రికార్డుకెక్కారు. 18 ఏళ్ల సమైరా ఏడాదిన్నరలో 6 పరీక్షలు క్లియర్ చేసి 200 గంటల ఫ్లయింగ్ అవర్ అనుభవాన్ని పొందారు. 25 ఏళ్లకే పైలట్ లైసెన్స్ పొందిన కెప్టెన్ తాపేశ్ కుమార్ తన స్ఫూర్తి అన్నారు. తల్లిదండ్రులు మద్దతుగా నిలిచారని లైసెన్స్ పొందిన సందర్భంగా సమైరా హర్షం వ్యక్తం చేశారు.
News December 3, 2024
EXCLUSIVE: ఇంటర్ విద్యార్థులకు GOOD NEWS
AP: ప్రభుత్వ ఇంటర్ కాలేజీల్లోనూ మధ్యాహ్న భోజనం అందించాలని విద్యాశాఖ మంత్రి లోకేశ్ నిర్ణయించారు. టెన్త్ తర్వాత డ్రాపౌట్స్ పెరుగుతుండటంతో భోజన సౌకర్యంతో ఈ సంఖ్య తగ్గించవచ్చని అధికారులతో సమీక్షలో పేర్కొన్నారు. అటు విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందించే పాఠ్యాంశాల కోసం చాగంటి కోటేశ్వరరావు సలహాలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. AP, TGలో ప్రస్తుతం ప్రభుత్వ స్కూళ్లలో మాత్రమే మిడ్ డే మీల్ ఉంది.