News November 21, 2024
PM కిసాన్, PM ఆవాస్ పేరుతో మోసాలు
TG: PM కిసాన్, PM ఆవాస్ యోజన పేరుతో వచ్చే SMSలను నమ్మవద్దని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కోరింది. సైబర్ నేరగాళ్లు ఈ పథకాల పేర్లతో నకిలీ SMSలు పంపి మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించింది. APK ఫైల్స్ పంపి, వాటి ద్వారా పథకంలో చేరాలని చెబితే ఆ లింక్స్ క్లిక్ చేయవద్దని సూచించింది. తెలియని వ్యక్తుల నుంచి APK ఫైల్స్ వస్తే ఓపెన్ చేయవద్దని హెచ్చరించింది. అనుమానం వస్తే 1930కి కాల్ చేయాలంది.
Similar News
News December 8, 2024
యాప్ ద్వారా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక: మంత్రి
TG: గత ప్రభుత్వ హయాంలో అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లను త్వరలోనే పూర్తి చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. అర్హులైన పేదలకు వీటిని ఇస్తామని, సంక్రాంతిలోపే ఈ ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు. మొదటి విడతగా రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు. లబ్ధిదారులను యాప్ ద్వారా ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు.
News December 8, 2024
కేసీఆర్ వస్తారో.. రారో.. మీరే చూస్తారు: హరీశ్
TG: బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌తో ఎర్రవెల్లిలో జరిగిన సమావేశంలో అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ జరిగినట్లు ఎమ్మెల్యే హరీశ్ రావు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను సభలో ఎండగడతామని చెప్పారు. రేపటి నుంచి అసెంబ్లీకి కేసీఆర్ వస్తారో.. రారో.. మీరే చూస్తారని చెప్పారు. కాంగ్రెస్ 6 గ్యారంటీల చట్టబద్ధత, రెండు విడతల రైతు బంధు ఇవ్వాలని పట్టుబడతామన్నారు. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.
News December 8, 2024
రాడార్ నుంచి అల్-అసద్ విమానం అదృశ్యం
సిరియా రెబల్స్ డమాస్కస్‌ను చుట్టుముట్టడంతో అధ్యక్షుడు బషర్ అల్-అసద్ కుటుంబంతో విమానంలో పరారయ్యారు. విమానం సిరియా తీర ప్రాంతం వైపు పయనించిందని తెలుస్తోంది. అయితే కొద్దిసేపటికే యూటర్న్ తీసుకొని వచ్చిన దారిలోనే తిరుగు ప్రయాణమైంది. తర్వాత రాడార్ నుంచి అదృశ్యమైనట్టు వార్తలొస్తున్నాయి. ఫ్లైట్‌ను బలవంతంగా ల్యాండ్ చేశారని తెలుస్తోంది. అసద్ రష్యా, ఇరాన్‌ను ఆశ్రయం కోరవచ్చని సమాచారం.