News November 21, 2024
నమ్మండి.. ఈ పెయింటింగ్ రూ.వెయ్యి కోట్లు
న్యూయార్క్‌లోని క్రిస్టీస్ ఆక్షన్‌లో ఓ పెయింటింగ్ రికార్డు స్థాయి ధర పలికింది. ప్రముఖ కళాకారుడు రెనే మాగ్రిట్టే వేసిన పెయింటింగ్‌కు 121 మిలియన్ డాలర్లు(సుమారు రూ.1,021కోట్లు) పలికింది. ఇది వరల్డ్ రికార్డు. కాగా ‘ది ఎంపైర్ ఆఫ్ లైట్’ అనే పేరుతో ప్రదర్శనకు వచ్చిన ఈ పెయింటింగ్‌ను రాత్రి, పగలు ఒకేసారి కనిపించేలా గీశారు. గతంలోనూ రెనే వేసిన ఓ పెయింటింగ్ 79మిలియన్ డాలర్లు పలకడం గమనార్హం.
Similar News
News December 3, 2024
మెగాస్టార్ న్యూ లుక్ అదిరిపోయిందిగా
మెగాస్టార్ చిరంజీవి కొత్త లుక్‌లో దర్శనమిచ్చారు. బ్లాక్ కలర్ టీషర్ట్ ధరించిన ఆయన ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. వీటిని షేర్ చేస్తూ వింటేజ్ చిరంజీవిని గుర్తు చేస్తున్నారని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. కాగా ఆయన నటించిన ‘విశ్వంభర’ ఫిబ్రవరిలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. తర్వాతి ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో చేయనున్నారు.
News December 3, 2024
నేను ఆ బ్యాచ్ కాదు: నిధి అగర్వాల్
హీరోయిన్ నిధి అగర్వాల్ ట్విటర్లో ఆస్క్ నిధి పేరిట అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలిచ్చారు. ఓ అభిమాని మీకు తెలుగు వచ్చా అని అడగ్గా.. ‘వస్తుందండీ. ఎందుకు డౌట్? నేను ‘అందరికీ నమస్కారం’ బ్యాచ్ కాదు’ అని జవాబిచ్చారు. రాజాసాబ్‌లో ‘డార్లింగ్ ఈజ్ బ్యాక్’ అని, తమిళంలో ఈ ఏడాది అమరన్ బాగా నచ్చిందని పేర్కొన్నారు. హరిహర వీరమల్లు మూవీ పార్ట్ 1తో పోలిస్తే పార్ట్ 2 వేగంగా విడుదలవుతుందని తెలిపారు.
News December 3, 2024
సైనిక పాలన.. ఏకపక్ష నిర్ణయం చెల్లదు!
దక్షిణ కొరియాలో సైనిక పాలనను మెజారిటీ నేషనల్ అసెంబ్లీ సభ్యులు వ్యతిరేకిస్తే చెల్లుబాటు కాదని తెలుస్తోంది. ఇప్పటికే దీన్ని విపక్ష డెమోక్రటిక్ పార్టీతోపాటు అధికార పీపుల్స్ పవర్ కూడా వ్యతిరేకిస్తోంది. దీంతో చట్టసభ సభ్యులు సమావేశమై దీన్ని వ్యతిరేకిస్తూ మెజారిటీ నిర్ణయాన్ని వెల్లడించేందుకు సిద్ధపడుతున్నారు. అక్కడి చట్ట ప్రకారం సైనిక పాలన సమయంలో చట్టసభ్యులను అరెస్టు చేయలేరు.