News November 21, 2024

నమ్మండి.. ఈ పెయింటింగ్ రూ.వెయ్యి కోట్లు

image

న్యూయార్క్‌లోని క్రిస్టీస్ ఆక్షన్‌లో ఓ పెయింటింగ్ రికార్డు స్థాయి ధర పలికింది. ప్రముఖ కళాకారుడు రెనే మాగ్రిట్టే వేసిన పెయింటింగ్‌కు 121 మిలియన్ డాలర్లు(సుమారు రూ.1,021కోట్లు) పలికింది. ఇది వరల్డ్ రికార్డు. కాగా ‘ది ఎంపైర్ ఆఫ్ లైట్’ అనే పేరుతో ప్రదర్శనకు వచ్చిన ఈ పెయింటింగ్‌‌ను రాత్రి, పగలు ఒకేసారి కనిపించేలా గీశారు. గతంలోనూ రెనే వేసిన ఓ పెయింటింగ్‌ 79మిలియన్ డాలర్లు పలకడం గమనార్హం.

Similar News

News March 15, 2026

వారికి LPG సిలిండర్లు బంద్.. కేంద్రం ప్రకటన

image

పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) కనెక్షన్లు ఉన్నవారికి ఎల్పీజీ సిలిండర్లు సప్లై చేయవద్దని కేంద్రం ఆదేశించింది. PNG వినియోగించుకుంటూనే డొమెస్టిక్ సిలిండర్లు తీసుకోవడం మంచిది కాదంది. వెంటనే LPG కనెక్షన్లు సరెండర్ చేయాలని స్పష్టం చేసింది. చమురు సంస్థలు వారికి కొత్తగా LPG కనెక్షన్లూ ఇవ్వొద్దని ఆదేశించింది. కాగా తెలుగు రాష్ట్రాల్లో HYDతో పాటు విశాఖ, విజయవాడ, గుంటూరు, కడప తదితర నగరాల్లో PNG సౌకర్యం ఉంది.

News March 15, 2026

గల్ఫ్ దేశాలపై దాడులు చేయొద్దు.. ఇరాన్‌ను కోరిన హమాస్!

image

గల్ఫ్ దేశాలపై దాడులు ఆపాలని తన మిత్రదేశం ఇరాన్‌ను పాలస్తీనా ఆర్మ్‌డ్ గ్రూప్ హమాస్ కోరింది. ‘పొరుగు దేశాలను లక్ష్యంగా చేసుకోవద్దని ఇరాన్ సోదరులను కోరుతున్నాం. ఈ ప్రాంతంలోని దేశాలన్నీ సోదరభావాన్ని కాపాడుకోవడానికి సహకరించాలి’ అని విజ్ఞప్తి చేసింది. US, ఇజ్రాయెల్ దాడుల నుంచి తనను తాను రక్షించుకునే హక్కు ఇరాన్‌కు ఉందని చెప్పింది. యుద్ధాన్ని ఆపేందుకు అన్ని దేశాలు, సంస్థలు కృషి చేయాలని పిలుపునిచ్చింది.

News March 15, 2026

ఎండల తీవ్రత.. కోళ్ల పెంపకంలో జాగ్రత్తలు

image

వేసవిలో కోళ్లకు అందించే దాణా, నీటి పరిమాణం 1:2 నిష్పత్తిలో ఉండేలా చూసుకోవాలి. ఉష్ణోగ్రతలు మరీ ఎక్కువగా ఉంటే 1:4 నిష్పత్తిలో ఉండాలి. నీటిలో ఎలక్ట్రోలైట్లు, విటమిన్స్ కలిపితే కోళ్లు ఒత్తిడికి గురికాకుండా ఉంటాయి. వీలైనంత వరకు కోళ్లకు ఎండలో ఉండే నీరు కాకుండా చల్లగా ఉండే నీటినే ఇవ్వాలి. కోళ్ల షెడ్లపైన గడ్డి కప్పి, స్ప్రింకర్లు అమర్చి.. షెడ్డు లోపల ఫాగర్స్‌తో ఎండ సమయంలో అరగంటకు ఒకసారి నీరు చల్లాలి.