News November 21, 2024
హారతి కర్పూరంలా కరిగిపోయిన అదానీ సంపద
గౌతమ్ అదానీపై న్యూయార్క్ డిస్ట్రిక్ట్ కోర్టు లంచం, ఫ్రాడ్ అభియోగాలు నమోదు చేయడంతో అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు క్రాష్ అయ్యాయి. దాదాపుగా అన్ని కంపెనీల షేర్లు రోజువారీ లోయర్ సర్క్యూట్‌ను తాకాయి. దీంతో 11 కంపెనీల స్టాక్స్ విలువ రూ.2.25 లక్షల కోట్లు తగ్గి రూ.12 లక్షల కోట్లకు చేరుకుంది. ఇక ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ జాబితా ప్రకారం గౌతమ్ అదానీ సంపద $10.5 బిలియన్లు తగ్గి $59.3 బిలియన్లకు చేరుకుంది.
Similar News
News November 23, 2024
ఆన్‌లైన్ మోటార్ బీమాలో మారుతీ, హ్యుందాయ్ హవా
ఆన్‌లైన్ మోటార్ బీమాలో మారుతీ, హ్యుందాయ్ సంస్థలు దూసుకెళ్తున్నాయని పాలసీబజార్ నివేదిక తాజాగా వెల్లడించింది. వాగన్ఆర్(5.9శాతం), స్విఫ్ట్(5.9), ఐ20(4.4), బలేనో(4.3), ఆల్టో(4.2శాతం) మార్కెట్లో మంచి వాటా దక్కించుకున్నాయని పేర్కొంది. ఇక EVల ఆన్‌లైన్ ఇన్సూరెన్స్‌లో 2022లో 423శాతం, గత ఏడాది 399శాతం పెరుగుదల నమోదైందని తెలిపింది. బీమా కొనుగోలుదారుల్లో అత్యధికులు 25 నుంచి 40 ఏళ్ల మధ్యవారేనని వివరించింది.
News November 23, 2024
రిషభ్ పంత్ ఖాతాలో మరో మైలురాయి
టీమ్ ఇండియా ప్లేయర్ రిషభ్ పంత్ ఖాతాలో మరో మైలురాయి చేరింది. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన మూడో భారత ఆటగాడిగా పంత్ నిలిచారు. ఇప్పటివరకు ఆయన 2,032 పరుగులు చేశారు. 52 ఇన్నింగ్సుల్లోనే ఆయన ఈ ఘనత అందుకోవడం విశేషం. తొలి రెండు స్థానాల్లో రోహిత్ (2,685), కోహ్లీ (2,432) ఉన్నారు. అలాగే ఆస్ట్రేలియాలో అత్యధిక పరుగులు చేసిన విదేశీ వికెట్ కీపర్‌గానూ పంత్ (661) రికార్డులకెక్కారు.
News November 23, 2024
ఏలియన్స్‌కు నక్షత్రాలే వాహనాలు?
అత్యంత అభివృద్ధి చెందిన గ్రహాంతరవాసులు విశ్వాన్ని అన్వేషించేందుకు వేగంగా కదిలే చిన్న నక్షత్రాలను వాహనాలుగా వాడుకుంటూ ఉండొచ్చని బెల్జియం పరిశోధకులు తాజాగా ప్రతిపాదించారు. వ్యోమనౌకను తయారుచేయడం కంటే నక్షత్రాల అయస్కాంత శక్తినే ఇంధనంగా వాడుకుంటూ వాటిపై ప్రయాణించడం వారికి సులువుగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ థియరీని పలువురు శాస్త్రవేత్తలు కొట్టిపారేస్తుండటం గమనార్హం.