News November 21, 2024
హారతి కర్పూరంలా కరిగిపోయిన అదానీ సంపద
గౌతమ్ అదానీపై న్యూయార్క్ డిస్ట్రిక్ట్ కోర్టు లంచం, ఫ్రాడ్ అభియోగాలు నమోదు చేయడంతో అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు క్రాష్ అయ్యాయి. దాదాపుగా అన్ని కంపెనీల షేర్లు రోజువారీ లోయర్ సర్క్యూట్‌ను తాకాయి. దీంతో 11 కంపెనీల స్టాక్స్ విలువ రూ.2.25 లక్షల కోట్లు తగ్గి రూ.12 లక్షల కోట్లకు చేరుకుంది. ఇక ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ జాబితా ప్రకారం గౌతమ్ అదానీ సంపద $10.5 బిలియన్లు తగ్గి $59.3 బిలియన్లకు చేరుకుంది.
Similar News
News December 13, 2024
రాహుల్ గాంధీకి అలహాబాద్ కోర్టు సమన్లు
జోడో యాత్రలో సావర్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ దాఖలైన పిటిషన్‌పై రాహుల్ గాంధీకి లక్నో కోర్టు సమన్లు జారీ చేసింది. సావర్కర్ బ్రిటిష్ పాలకులకు సేవలందించారని, పింఛన్ కూడా తీసుకున్నారంటూ రాహుల్ ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ఓ న్యాయవాది పిటిషన్ వేశారు. దీనితో ఏకీభవించిన కోర్టు అభియోగాలపై విచారణ ఎదుర్కొనేందుకు జనవరి 10న తమ ముందు హాజరుకావాలని ఆదేశించింది.
News December 13, 2024
బిడ్డకు జన్మనిచ్చిన ప్రముఖ హీరోయిన్
ప్రముఖ హీరోయిన్ రాధికా ఆప్టే తల్లి అయ్యారు. తాను బిడ్డకు జన్మనిచ్చిన విషయాన్ని ఆమె తాజాగా వెల్లడించారు. బిడ్డకు పాలిస్తూ ల్యాప్‌టాప్‌తో వర్క్ చేస్తున్న ఫొటోను ఆమె పంచుకున్నారు. 2011లో బ్రిటన్‌కు చెందిన బెనెడిక్ట్ టేలర్‌తో లివింగ్ టుగెదర్ తర్వాత 2012లో ఆమె పెళ్లి చేసుకున్నారు. దీంతో ఈ జంటకు అందరూ శుభాకాంక్షలు చెబుతున్నారు.
News December 13, 2024
‘పిల్లిపై ప్రేమ ఒలకబోస్తున్నాడు’.. భర్తపై భార్య కేసు
పిల్లిపై అధిక ప్రేమ చూపిస్తున్నాడంటూ ఓ భర్తపై భార్య IPC 498A కింద గృహ హింస కేసు పెట్టారు. దీనిని కర్ణాటక HC జడ్జి జస్టిస్ నాగప్రసన్న విచారించారు. తన కంటే పిల్లినే ప్రేమగా చూస్తున్నారని భార్య చేసిన ఆరోపణలకు, కేసు పెట్టిన సెక్షన్లకు సంబంధం లేదని జడ్జి పేర్కొన్నారు. దీనిపై విచారణకు ఆదేశించడం చట్టాన్ని దుర్వినియోగం చేయడమే అవుతుందన్నారు. భర్తకు మధ్యంతర రక్షణ కల్పించారు.