News November 21, 2024
STOCK MARKETS: ఎంత నష్టపోయాయంటే!
దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. అమెరికా కోర్టులో అదానీపై కేసులు, గ్లోబల్ మార్కెట్ల నుంచి నెగటివ్ సిగ్నల్స్, డాలర్ దూకుడు పెరగడమే ఇందుకు కారణాలు. సెన్సెక్స్ 77,155 (-422), నిఫ్టీ 23,349 (-168) వద్ద క్లోజయ్యాయి. ADANIENT, ADANI PORTS, SBILIFE, SBI, NTPC టాప్ లూజర్స్. పవర్ గ్రిడ్, అల్ట్రాటెక్ సెమ్, హిందాల్కో, అపోలో హాస్పిటల్స్, గ్రాసిమ్ టాప్ గెయినర్స్. IT, REALTY సూచీలు పుంజుకున్నాయి.
Similar News
News November 24, 2024
వెంకటేశ్ అయ్యర్‌కు జాక్‌పాట్
భారీ హిట్లు కొట్టగలిగే ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ ఐపీఎల్ వేలంలో జాక్‌పాట్ కొట్టారు. రూ.23.75 కోట్లకు KKR దక్కించుకుంది. బేస్ ప్రైజ్ రూ.2కోట్లతో వేలంలోకి వచ్చిన ఇతడి కోసం LSG, KKR, RCB పోటీ పడ్డాయి. ఐపీఎల్ కెరీర్‌లో ఇతను 137 స్ట్రైక్ రేట్‌తో 1326 రన్స్ చేశారు. ఒక సెంచరీ కూడా ఉంది. కొన్ని సీజన్లుగా వెంకటేశ్ అయ్యర్ కోల్‌కతా తరఫున కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు.
News November 24, 2024
రవిచంద్రన్ అశ్విన్‌కు భారీ ధర.. ఎంతంటే?
స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను రూ.9.75కోట్లతో CSK సొంతం చేసుకుంది. రూ.2కోట్ల బేస్ ప్రైజ్‌తో ఇతను ఆక్షన్‌లోకి రాగా చెన్నై, రాజస్థాన్ పోటీ పడ్డాయి. ఐపీఎల్ కెరీర్‌లో 212 మ్యాచ్‌లు ఆడిన అశ్విన్ 180 వికెట్లు తీశారు. ఎకానమీ 7.1గా ఉంది. చెన్నై పిచ్‌లో అశ్విన్ రాణించగలడన్న విశ్వాసంతో CSK ఇంత ధర పెట్టినట్లు తెలుస్తోంది.
News November 24, 2024
రచిన్ రవీంద్రను తిరిగి దక్కించుకున్న చెన్నై
ఓపెనింగ్ బ్యాటర్ రచిన్ రవీంద్రను CSK రూ.4కోట్లకు కొనుగోలు చేసింది. బేస్ ప్రైజ్ రూ.1.50 కోట్లతో వేలంలోకి వచ్చిన ఇతడి కోసం పంజాబ్, చెన్నై పోటీ పడ్డాయి. గత సీజన్లో చెన్నై తరఫున ఆడిన ఇతను 161 స్ట్రైక్ రేట్‌తో 222 పరుగులు చేశారు.