News November 22, 2024
నెతన్యాహుపై వారెంట్‌ను వ్యతిరేకిస్తున్నాం: US
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ICC) జారీ చేసిన అరెస్ట్ వారెంట్‌ను వ్యతిరేకిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. ‘అరెస్ట్ వారెంట్ విషయంలో ప్రాసిక్యూటర్ కంగారు ఆందోళన కలిగిస్తోంది. ఈ అంశంలో ICCకి అధికారం లేదు’ అని శ్వేత సౌధం పేర్కొంది. కాగా.. US జాతీయ భద్రతా సలహాదారు బాధ్యతల్ని స్వీకరించనున్న మైక్ వాల్జ్ ఐసీసీపై మండిపడ్డారు. ఆ సంస్థకు విశ్వసనీయతే లేదని తేల్చిచెప్పారు.
Similar News
News November 22, 2024
47/4.. పీకల్లోతు కష్టాల్లో భారత్
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. 47 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. క్రీజులో కుదురుకున్నట్లు కనిపించిన రాహుల్(26) స్టార్క్ బౌలింగ్‌లో కీపర్ క్యాచ్ రూపంలో ఔటయ్యారు. జైస్వాల్(0), పడిక్కల్(0), కోహ్లీ (5) విఫలమయ్యారు. క్రీజులో పంత్(10), జురెల్(0) ఉన్నారు.
News November 22, 2024
కూటమి నేతలకు అధికారమదం నెత్తికెక్కింది: YCP
కూటమి నేతలు అధికారమదం నెత్తికెక్కి మాట్లాడుతున్నారని YCP ఆగ్రహం వ్యక్తం చేసింది. శాసనమండలిలో గురువారం మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పిన ఓ సామెతపై ఆ పార్టీ ‘X’ వేదికగా మండిపడింది. మొన్నటి వరకూ తిరుమల లడ్డూపై ప్రచారం చేసి, ఇప్పుడు హజ్ యాత్రపై వెటకారమా? అని ప్రశ్నించింది. అటు, తన మాటలు ఏ కులాన్నీ, మతాన్నీ అవమానపరిచేలా లేవన్న మంత్రి ఒకవేళ ఉన్నట్లు భావిస్తే వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పారు.
News November 22, 2024
RECORD: $99000ను తాకిన BITCOIN
బిట్‌కాయిన్ మరో రికార్డు సృష్టించింది. చరిత్రలో తొలిసారి $99000 మైలురాయిని టచ్ చేసింది. శుక్రవారం సింగపూర్‌లో $99388 వద్ద జీవితకాల గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం $98660 స్థాయిలో చలిస్తోంది. US కొత్త ప్రెసిడెంట్‌గా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన NOV 5 నుంచి బిట్‌కాయిన్ మార్కెట్ విలువ లక్ష కోట్ల డాలర్ల మేర పెరగడం గమనార్హం. అనేక సంస్థలు BTC ETFs, OPTIONS ప్రవేశపెడుతుండటంతో డిమాండ్ ఎగిసింది.