News November 22, 2024

నెతన్యాహుపై వారెంట్‌ను వ్యతిరేకిస్తున్నాం: US

image

ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు(ICC) జారీ చేసిన అరెస్ట్ వారెంట్‌ను వ్యతిరేకిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. ‘అరెస్ట్ వారెంట్ విషయంలో ప్రాసిక్యూటర్ కంగారు ఆందోళన కలిగిస్తోంది. ఈ అంశంలో ICCకి అధికారం లేదు’ అని శ్వేత సౌధం పేర్కొంది. కాగా.. US జాతీయ భద్రతా సలహాదారు బాధ్యతల్ని స్వీకరించనున్న మైక్ వాల్జ్ ఐసీసీపై మండిపడ్డారు. ఆ సంస్థకు విశ్వసనీయతే లేదని తేల్చిచెప్పారు.

Similar News

News December 14, 2024

వారంలో ఎస్సీ వర్గీకరణపై నివేదిక: సీఎం రేవంత్

image

TG: ఎస్సీ వర్గీకరణకు తమ పార్టీ అనుకూలమని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. HYDలో గ్లోబల్ మాదిగ డే-2024లో ఆయన పాల్గొన్నారు. ‘వారం రోజుల్లో ఎస్సీ వర్గీకరణపై షమీమ్ అక్తర్ కమిషన్ నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. ఇబ్బందులు రాకుండా వర్గీకరణ చేస్తాం. రాజకీయ, అధికార నియామకాల్లో మాదిగలకు ప్రాధాన్యం ఇస్తున్నాం. చరిత్రలో తొలిసారిగా ఉస్మానియా యూనివర్సిటీ వీసీగా మాదిగ వ్యక్తిని నియమించాం’ అని CM చెప్పారు.

News December 14, 2024

బాంబు బెదిరింపులకు పాల్పడింది 12 ఏళ్ల బాలుడు?

image

దేశ రాజధాని ఢిల్లీలోని పలు స్కూళ్లకు వరుస బాంబు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. కాగా ఈ బెదిరింపులకు పాల్పడింది 12 ఏళ్ల బాలుడని పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. అతడితో పాటు తల్లిదండ్రులకు కూడా పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి పంపినట్లు సమాచారం. గతంలో బాంబు బెదిరింపులకు పాల్పడిన వారిని పట్టుకోలేదనే కోపంతోనే ఆ విద్యార్థి ఈ పని చేసినట్లు తెలుస్తోంది.

News December 14, 2024

BIG NEWS.. త్వరలో 6,000 ఉద్యోగాలు భర్తీ

image

TG: టీచర్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న వారికి శుభవార్త. త్వరలోనే 6వేల టీచర్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి DSC నోటిఫికేషన్ ఇస్తామని డిప్యూటీ CM భట్టి విక్రమార్క ప్రకటించారు. ఖమ్మం జిల్లా బోనకల్ గురుకుల స్కూలులో విద్యార్థులతో కలిసి ఆయన భోజనం చేశారు. ‘గత పదేళ్లు DSC నోటిఫికేషన్ ఇవ్వకుండా BRS విద్యావ్యవస్థను నాశనం చేసింది. మేం అధికారంలోకి రాగానే 11వేల టీచర్ ఉద్యోగాలు భర్తీ చేశాం’ అని ఆయన వెల్లడించారు.