News November 22, 2024
విశాఖ: జీవీఎంసీ క్రికెట్ జట్టు ఘన విజయం

విశాఖలో జింక్ మైదానంలో జరిగిన క్రికెట్ మ్యాచ్‌లో జీవీఎంసీ జట్టు ఘన విజయం సాధించిందని జీవీఎంసీ అదనపు కమిషనర్ రమణమూర్తి తెలిపారు. గురువారం జరిగిన వీడీసీఏ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో GVMC క్రికెట్ జట్టు 47 పరుగుల తేడాతో MOV జట్టుపై ఘన విజయం సాధించిందన్నారు. మొదటిగా బ్యాటింగ్ చేసిన జీవీఎంసీ జట్టు 20 ఓవర్లలో 159 పరుగులు చేసింది. అనంతరం MOV జట్టు 20 ఓవర్లలో 112 పరుగులు మాత్రమే సాధించి ఓటమి చెందిందన్నారు.
Similar News
News January 25, 2026
లడ్డా – జిమిడిపేట మధ్య మూడో రైల్వే లైన్ ప్రారంభం

వాల్తేరు డివిజన్‌లోని లడ్డా-జిమిడిపేట స్టేషన్ల మధ్య నూతనంగా నిర్మించిన 7.181 కి.మీ.ల మూడో రైల్వే లైన్‌ను రైల్వే భద్రతా కమిషనర్ (CRS) బ్రిజేశ్ కుమార్ మిశ్రా శనివారం తనిఖీ చేశారు. తిత్లాగఢ్ – విజయనగరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన ఈ మార్గంలో స్పీడ్ ట్రయల్స్ విజయవంతమయ్యాయి. భద్రతా ప్రమాణాల పరిశీలన అనంతరం రైళ్ల రాకపోకలకు అనుమతి లభించింది. ఈ కార్యక్రమంలో DRM లలిత్ బోహ్రా, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
News January 25, 2026
విశాఖ ఉత్సవ్‌లో నేడు కామాక్షి లైవ్ వయోలిన్ షో

సాగరతీరానా జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటక శాఖ ఆధ్వర్యంలో విశాఖ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం సాయంత్రం ఆర్కేబీచ్ రోడ్డులో ప్రముఖ సంగీత వయోలిన్ విద్వాంసురాలు కామాక్షి లైవ్ వయోలిన్ షో నిర్వహించనున్నారు. కామాక్షి ఇండియన్ ఐడల్, పలు మెగా ఈవెంట్స్‌లో ప్రదర్శనలు ఇచ్చారు.
News January 25, 2026
విశాఖ సీపీ కార్యాలయంలో సోమవారం PGRS రద్దు

విశాఖ సీపీ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే PGRS జనవరి 26న సోమవారం గణతంత్ర దినోత్సవ సందర్భంగా రద్దు చేసినట్టు సీపీ శంఖబ్రత బాగ్చి శనివారం తెలిపారు. ఫిర్యాదుదారులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.
ప్రజలు సమస్యలు ఉంటే 112కు కాల్ చేయవచ్చని పేర్కొన్నారు. వచ్చే సోమవారం అనగా ఫిబ్రవరి 2వ తేదీ PGRS యధావిధిగా నిర్వహించనున్నారు.


