News November 22, 2024
47/4.. పీకల్లోతు కష్టాల్లో భారత్
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. 47 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. క్రీజులో కుదురుకున్నట్లు కనిపించిన రాహుల్(26) స్టార్క్ బౌలింగ్‌లో కీపర్ క్యాచ్ రూపంలో ఔటయ్యారు. జైస్వాల్(0), పడిక్కల్(0), కోహ్లీ (5) విఫలమయ్యారు. క్రీజులో పంత్(10), జురెల్(0) ఉన్నారు.
Similar News
News November 22, 2024
మమ్మల్ని రెచ్చగొట్టకండి: రష్యా హెచ్చరిక
ఉక్రెయిన్‌కు సాయం చేయడం మానుకోవాలని పశ్చిమ దేశాలకు రష్యా తాజాగా సూచించింది. తమను రెచ్చగొట్టొద్దని పేర్కొంది. ‘మా గడ్డపై జరిగే దాడుల్లో పశ్చిమ దేశాలు జోక్యం చేసుకోవద్దు. ఉక్రెయిన్‌కు ఆయుధాలు సరఫరా చేయొద్దు. మీ వైఖరి ఇలాగే కొనసాగితే ఉక్రెయిన్‌పై మరిన్ని క్షిపణి దాడులు చేస్తాం’ అని హెచ్చరించింది. ఉక్రెయిన్‌లో జనావాసాల మీదకు రష్యా బాలిస్టిక్ క్షిపణి దాడి చేయడం కలకలం రేపిన సంగతి తెలిసిందే.
News November 22, 2024
బియ్యంలో పురుగులు.. ఇలా చేస్తే దరిచేరవు!
ప్రభుత్వ హాస్టళ్లలో పురుగుల అన్నం తిని విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్న ఘటనలు ఆందోళనకరం. ఈ నేపథ్యంలో బియ్యంలో పురుగులు రాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చిట్కాలను పలువురు సూచిస్తున్నారు. బియ్యం నిల్వ ఉంచే డబ్బాల్లో ఘాటైన వాసన ఉండేవాటిని వేయాలని చెబుతున్నారు. వేపాకు, బిరియానీ ఆకు, లవంగాలు, ఇంగువ, కర్పూరం, వెల్లుల్లి రెబ్బలు, ఎండు మిర్చి, రాతి ఉప్పు పొట్లాలను వాటిలో ఉంచాలని చెబుతున్నారు.
News November 22, 2024
ఛాంపియన్స్ ట్రోఫీపై 26న ICC అత్యవసర సమావేశం
వచ్చే ఏడాది పాక్‌లో జరగాల్సిన ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ విషయంలో అనిశ్చితి నెలకొనడంతో ఐసీసీ ఈ నెల 26న అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. బీసీసీఐ, పీసీబీ పెద్దలు ఇందులో పాల్గొంటారు. భద్రతాకారణాల రీత్యా పాక్‌కు క్రికెటర్లను పంపేదే లేదని భారత్ చెబుతుండగా, పంపాల్సిందేనని పాక్ పట్టుబడుతోంది. ఈ నేపథ్యంలో ఐసీసీ రెండింటి మధ్య సయోధ్యకు యత్నిస్తోంది.