News November 22, 2024
BGT స్టంప్స్: పట్టుబిగించిన భారత్

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో తొలి టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు సత్తా చాటారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 67/7 స్కోర్ చేసింది. కెప్టెన్ బుమ్రా 4 వికెట్లతో కంగారూలను బెంబేలెత్తించగా సిరాజ్ 2, రాణా 1 వికెట్ తీసి టెస్టుపై పట్టు బిగించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ 150 రన్స్ చేసి ఆలౌటైంది. కాగా ఆస్ట్రేలియా ప్రస్తుతం 83 రన్స్ వెనుకబడి ఉంది.
Similar News
News September 19, 2025
సాయుధ పోరాటం ఆపబోం: మావోయిస్టులు

తమ సాయుధ పోరాటాన్ని ఆపబోమని మావోయిస్టులు లేఖ రిలీజ్ చేశారు. ‘ఆపరేషన్ కగార్ ఆపితే ఆయుధాలు వదిలేస్తాం, కాల్పుల విరమణ పాటిస్తాం’ అని ఇటీవల అభయ్(సోనూ) పేరుతో లేఖ వచ్చిన విషయం తెలిసిందే. ఇది ఆయన వ్యక్తిగతమంటూ మావోల అధికార ప్రతినిధి జగన్ పేరిట లేఖ విడుదలైంది. సాయుధ పోరాటాన్ని విరమిస్తున్నానని సోనూ ఎందుకు ప్రకటించాడో అర్థం కావట్లేదన్నారు. ఇటువంటి పద్ధతులు ఉద్యమానికి నష్టం చేస్తాయని పేర్కొన్నారు.
News September 19, 2025
దసరా సెలవులు పొడిగించాలని డిమాండ్!

తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లు, కాలేజీలకు దసరా సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. APలో ఈనెల 22-OCT2 వరకు సెలవులిచ్చి, 3న రీఓపెన్ చేస్తామని పేర్కొన్నాయి. అయితే, పండుగ 2వ తేదీనే ఉందని.. సొంతూళ్లు, బంధువుల ఇళ్లకు వెళ్లిన విద్యార్థులు మరుసటిరోజే ఎలా వస్తారని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. 4వ తేదీ వరకైనా హాలిడేస్ పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. TGలో స్కూళ్లకు ఈనెల 21-OCT3 వరకు సెలవులిచ్చారు.
News September 19, 2025
పండగ సంతోషం లేకుండా చేయడమేనా ప్రజాపాలన: హరీశ్

TG: దసరా స్పెషల్ బస్సుల్లో టికెట్ రేట్లు <<17756948>>సవరించడంపై<<>> BRS నేత హరీశ్‌రావు ఫైరయ్యారు. ‘పండుగలు వస్తే పల్లె వెలుగు సహా అన్ని రకాల బస్సుల్లో ధరలు విపరీతంగా పెంచి ప్రయాణికుల నుంచి ముక్కు పిండి ఛార్జీలు వసూలు చేయడం దుర్మార్గం. అదనపు సర్వీసుల పేరిట 50% అదనంగా దోపిడీ చేస్తున్నారు. ప్రజలకు బతుకమ్మ, దసరా సంతోషం లేకుండా చేయడమేనా ప్రజాపాలన? ఇదేనా ప్రభుత్వ వైఖరి?’ అని ప్రశ్నించారు.