News November 22, 2024
BGT స్టంప్స్: పట్టుబిగించిన భారత్
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో తొలి టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు సత్తా చాటారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 67/7 స్కోర్ చేసింది. కెప్టెన్ బుమ్రా 4 వికెట్లతో కంగారూలను బెంబేలెత్తించగా సిరాజ్ 2, రాణా 1 వికెట్ తీసి టెస్టుపై పట్టు బిగించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ 150 రన్స్ చేసి ఆలౌటైంది. కాగా ఆస్ట్రేలియా ప్రస్తుతం 83 రన్స్ వెనుకబడి ఉంది.
Similar News
News December 7, 2024
సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
AP: 2025 ఏడాదికి సంబంధించి సాధారణ, ఆప్షనల్ హాలిడేల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. దీని ప్రకారం 23 సాధారణ, 19 ఆప్షనల్ సెలవులు ఉన్నాయి. 23 సాధారణ సెలవుల్లో రిపబ్లిక్ డే, ఉగాది, శ్రీరామనవమి, మొహర్రం ఆదివారం రావడంతో 19 సెలవులు మాత్రమే ఉద్యోగులకు లభించనున్నాయి. ఆప్షనల్ హాలిడేస్‌లో ఈద్-ఎ-గదిర్, మహాలయ అమావాస్య ఆదివారం వచ్చాయి. మొత్తం 12 నెలల్లో మే, నవంబర్ తప్ప 10 నెలల్లో సెలవులు ఉన్నాయి.
News December 7, 2024
విద్యార్థులకు ఫుడ్ పాయిజన్.. సర్కార్ కీలక ఆదేశాలు
TG: రాష్ట్రంలోని ప్రభుత్వ, మోడల్ స్కూళ్లు, గురుకులాలు, హాస్టళ్లు, KGBVల్లో ఆహార నాణ్యతపై ప్రభుత్వం ప్రత్యేక నిబంధనలు జారీ చేసింది. బియ్యంలో పురుగులు, బూజు కనిపిస్తే వాడకూడదు. విద్యార్థులకు భోజనం వేడివేడిగా వడ్డించాలి. వండిన వెంటనే ప్రిన్సిపల్, మెస్ ఇన్‌ఛార్జి రుచి చూడాలి. మిగిలిన ఆహారాన్ని విద్యార్థులకు పెట్టకూడదు. రెండు పూటలకు పప్పు ఒకేసారి వండకూడదు. సిబ్బంది మాస్కు, టోపీ, ఆప్రాన్ ధరించాలి.
News December 7, 2024
మార్చి 15 నుంచి టెన్త్ ఎగ్జామ్స్?
AP: రాష్ట్రంలో వచ్చే ఏడాది మార్చి 15 నుంచి పదో తరగతి పరీక్షలు జరుగుతాయని తెలుస్తోంది. కొత్త సిలబస్ ప్రకారమే ఈ ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు సమాచారం. అలాగే గతంలో పరీక్ష రాసి ఫెయిలైన వారికి పాత సిలబస్ ప్రకారం పరీక్షలు ఉంటాయని తెలుస్తోంది. ఇప్పటికే వెబ్‌సైట్‌లో ప్రశ్నాపత్రాలు, మోడల్ పేపర్లు, మార్కుల వెయిటేజీ వంటి తదితర వివరాలు పొందుపరిచారు.