News November 23, 2024

ఇద్దరి తనయుల తడాఖా

image

మహారాష్ట్ర ఎన్నికల్లో ఠాక్రే కుటుంబీకుల యువతరం ఆధిక్యత కనబరుస్తోంది. శివసేన (UBT) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే తనయుడు ఆదిత్య ఠాక్రే వర్లిలో లీడింగ్‌లో ఉన్నారు. ఇక వీరి బంధువైన మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన చీఫ్ రాజ్ ఠాక్రే కుమారుడు అమిత్ మహిమ్ నియోజకవర్గంలో ఆధిక్యంలో ఉన్నారు.

Similar News

News November 23, 2024

ప్రియాంక గెలుపుపై స్పందించిన రాబర్ట్ వాద్రా

image

తన భార్య ప్రియాంకా గాంధీ వయనాడ్‌లో గెలవడంపై రాబర్ట్ వాద్రా స్పందించారు. ‘ప్రియాంక కృషిని గుర్తించిన కేరళ ప్రజలకు ధన్యవాదాలు. ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో ఆమె ఈ ఎన్నికల్లో పోటీ చేశారు. నాకూ అలాంటి సమయం రావొచ్చు. ప్రజల కోసం నేను శ్రమిస్తూనే ఉంటా. ప్రజలు ఏం కోరుకుంటే అదే జరుగుతుంది’ అని వాద్రా మీడియాతో అన్నారు.

News November 23, 2024

చైతూ బర్త్ డే.. ‘NC24’ నుంచి అప్డేట్

image

అక్కినేని నాగ చైతన్య హీరోగా ‘NC24’ను కార్తీక్ దండు తెరకెక్కించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. చైతూ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తుండగా అజనీశ్ లోక్‌నాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు. కాగా, SVCC ఈ చిత్రాన్ని నిర్మించనుంది.

News November 23, 2024

ఆ పార్టీలు కలిసిపోతాయా లేక ఉనికే కోల్పోతాయా?

image

మహారాష్ట్రలో పరాభవం శివసేన UBT, NCP SPకి ప్రాణ సంకటంగా మారింది. ప్రస్తుత రాజకీయాల్లో మ్యాజిక్ ఫిగర్‌కు 5-6 సీట్లతో దూరమైన పార్టీలే ప్రాభవం కోల్పోతున్నాయి. ఆర్థిక వనరుల్లేక చతికిలపడుతున్నాయి. అలాంటిది విడిపోయి బలహీనపడిన పై పార్టీలు ఇప్పుడు ఉనికి కోల్పోయే ప్రమాదంలో పడ్డాయి. ఉద్ధవ్ ఠాక్రేకు వ్యూహరచన, పార్టీని నడపడంలో అనుభవం లేదు. సీనియర్ శరద్ పవార్ రిటైర్మెంట్ ప్రకటించడంతో భవితవ్యం బోధపడటం లేదు.