News November 23, 2024

ఇద్దరి తనయుల తడాఖా

image

మహారాష్ట్ర ఎన్నికల్లో ఠాక్రే కుటుంబీకుల యువతరం ఆధిక్యత కనబరుస్తోంది. శివసేన (UBT) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే తనయుడు ఆదిత్య ఠాక్రే వర్లిలో లీడింగ్‌లో ఉన్నారు. ఇక వీరి బంధువైన మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన చీఫ్ రాజ్ ఠాక్రే కుమారుడు అమిత్ మహిమ్ నియోజకవర్గంలో ఆధిక్యంలో ఉన్నారు.

Similar News

News December 8, 2024

‘ఏపీలో 3వేల మంది బాలికల అదృశ్యం’.. CSకు NHRC సమన్లు

image

AP: రాష్ట్రంలో 3వేల మంది బాలికలు అదృశ్యమయ్యారని అందిన ఫిర్యాదు విషయంలో సీఎస్‌కు NHRC సమన్లు జారీ చేసింది. దీనిపై నివేదికలు పంపాలని రిమైండర్లు పంపినా స్పందించకపోవడంపై మండిపడింది. పూర్తి సమాచారం, డాక్యుమెంట్లతో జనవరి 20లోపు తమ ముందు వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది. బాలికల మిస్సింగ్‌పై ఓ ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్త ఆధారంగా ఓ సామాజిక కార్యకర్త గత జనవరిలో కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.

News December 8, 2024

చరిత్ర సృష్టించిన ‘పుష్ప-2’

image

భారత సినీ చరిత్రలో అత్యంత వేగంగా ₹500కోట్ల కలెక్షన్స్ సాధించిన సినిమాగా ‘పుష్ప-2’ రికార్డు సృష్టించింది. అలాగే హిందీలో తొలి 2 రోజుల్లో అత్యధిక వసూళ్ల (₹131కోట్లు) రికార్డు నెలకొల్పింది. తొలి 2 రోజుల్లోనే ₹449cr రాబట్టిన ఈ మూవీ, మూడో రోజు దేశవ్యాప్తంగా ₹120కోట్ల వరకూ రాబట్టినట్లు సినీ వర్గాలు తెలిపాయి. మూడో రోజు సౌత్‌(₹45cr) కంటే నార్త్‌లోనే(₹75cr) ఎక్కువ వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది.

News December 8, 2024

ప్రపంచ ధ్యాన దినోత్సవంగా DEC 21

image

ఏటా డిసెంబర్ 21న ప్రపంచ ధ్యాన దినోత్సవంగా జరుపుకోవాలన్న ప్రతిపాదనను ఐక్యరాజ్యసమితి ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ విషయాన్ని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి హరీశ్ వెల్లడించారు. భారత్, శ్రీలంక, నేపాల్, మెక్సికో దేశాల బృందం ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టాయని తెలిపారు. ‘సర్వజన శ్రేయస్సు, అంతర్గత పరివర్తన కోసం ఓ రోజు. డిసెంబర్ 21న ధ్యాన దినోత్సవంగా జరుపుకునేందుకు భారత్ మార్గనిర్దేశం చేసింది’ అని పేర్కొన్నారు.