News November 23, 2024
మహారాష్ట్ర: కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే వెనుకంజ
మహారాష్ట్ర ఓట్ల లెక్కింపు ఎర్లీ ట్రెండ్స్‌లో బడా నేతలు వెనకంజలో ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. కాంగ్రెస్ స్టేట్ చీఫ్ నానా పటోలే (సకోలి), మిలింద్ దేవర (వర్లి), జీషన్ సిద్ధిఖీ (వాంద్రె ఈస్ట్) వెనుకంజలో ఉన్నాయి. సీఎం ఏక్‌నాథ్ శిండే (కోప్రి), అజిత్ పవార్ (బారామతి) ఆధిక్యాలు మారుతున్నాయి. కాసేపు ఆధిక్యం, మరికాసేపు వెనుకంజలో ఉంటున్నారు. బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ (నాగ్‌పుర్ సౌత్‌వెస్ట్) జోరుమీదున్నారు.
Similar News
News November 23, 2024
38 ఏళ్ల తర్వాత భారత ఓపెనింగ్ జోడీ అదుర్స్
ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో భారత ఓపెనర్లు జైస్వాల్(90*), కేఎల్ రాహుల్(62*) రికార్డు సృష్టించారు. AUS గడ్డపై 20 ఏళ్ల తర్వాత ఓపెనింగ్ సెంచరీ(172*) భాగస్వామ్యం నమోదు చేశారు. 2004లో సెహ్వాగ్-ఆకాశ్ చోప్రా 123 రన్స్ చేశారు. అలాగే ఆ దేశంలో 38 ఏళ్ల తర్వాత 150కి పైగా పరుగులు చేసిన భారత ఓపెనింగ్ జోడీగా జైస్వాల్, రాహుల్ నిలిచారు. చివరగా 1986లో గవాస్కర్-శ్రీకాంత్ జోడీ 191 రన్స్ పార్ట్‌నర్‌షిప్ నమోదుచేసింది.
News November 23, 2024
వెనుకంజలో బాబా సిద్ధిఖీ కుమారుడు
MHలో ఇటీవల హత్యకు గురైన మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ కుమారుడు జీషన్ వాంద్రే ఈస్ట్ నుంచి వెనుకంజలో ఉన్నారు. ఆయనపై శివసేన UBT అభ్యర్థి వరుణ్ సతీశ్ 10K ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. వివాదాస్పద NCP నేత నవాబ్ మాలిక్ మన్‌ఖుద్ర్ శివాజీ నగర్‌లో నాలుగో స్థానానికి పరిమితమయ్యారు. ఆయన కుమార్తె సనా మాలిక్ అనుశక్తి నగర్‌లో నటి స్వరా భాస్కర్ భర్త ఫహద్‌పై 3వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
News November 23, 2024
కాంగ్రెస్ ఫ్లాప్ షో.. ‘INDIA’పై ఎఫెక్ట్ తప్పదా?
దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ ఫ్లాప్ షో కొనసాగిస్తోంది. మహారాష్ట్రలో 101 స్థానాల్లో పోటీ చేసి 18, ఝార్ఖండ్‌లో 30 చోట్ల బరిలో నిలిచి 15 స్థానాలకు పరిమితమైంది. ఇటీవల హరియాణా, అంతకుముందు రాజస్థాన్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే తీరు. ఇకపై INDIAలో కాంగ్రెస్ మాట చెల్లుబాటు కాదని, ఆ కూటమే గల్లంతైనా ఆశ్చర్యం లేదని విశ్లేషకుల అంచనా. ప్రత్యామ్నాయ వేదిక ఏర్పాటుకు ప్రయత్నాలు సాగొచ్చని పేర్కొంటున్నారు.