News November 23, 2024
మహారాష్ట్ర: కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే వెనుకంజ
మహారాష్ట్ర ఓట్ల లెక్కింపు ఎర్లీ ట్రెండ్స్‌లో బడా నేతలు వెనకంజలో ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. కాంగ్రెస్ స్టేట్ చీఫ్ నానా పటోలే (సకోలి), మిలింద్ దేవర (వర్లి), జీషన్ సిద్ధిఖీ (వాంద్రె ఈస్ట్) వెనుకంజలో ఉన్నాయి. సీఎం ఏక్‌నాథ్ శిండే (కోప్రి), అజిత్ పవార్ (బారామతి) ఆధిక్యాలు మారుతున్నాయి. కాసేపు ఆధిక్యం, మరికాసేపు వెనుకంజలో ఉంటున్నారు. బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ (నాగ్‌పుర్ సౌత్‌వెస్ట్) జోరుమీదున్నారు.
Similar News
News December 11, 2024
శ్రీలీలకు పెళ్లి చేసే బాధ్యత నాదే: సీనియర్ హీరో
అన్‌స్టాపబుల్ షోలో శ్రీలీలపై ప్రేమను సీనియర్ హీరో బాలకృష్ణ మరోసారి చాటుకున్నారు. ఈ బ్యూటీకి పెళ్లి సంబంధాలు చూసే బాధ్యత తనదేనని చెప్పారు. మంచి లక్షణాలు ఉన్న కుర్రాడిని వెతికిపెడతానని తెలిపారు. అంతకుముందు తాను పెద్దలు కుదిర్చిన సంబంధమే చేసుకుంటానని శ్రీలీల చెప్పిన సంగతి తెలిసిందే. కాగా వీరిద్దరూ కలిసి ‘భగవంత్ కేసరి’ సినిమాలో నటించారు.
News December 11, 2024
‘ప్రజావాణి’ కొనసాగుతుంది: భట్టి విక్రమార్క
TG: ఎన్ని ఇబ్బందులొచ్చినా ‘ప్రజావాణి’ కొనసాగుతుందని dy.CM భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. సమస్యలతో వస్తున్న వారందరికీ పరిష్కారం చూపుతున్నామన్నారు. దరఖాస్తులన్నీ పరిశీలిస్తున్నామని, ప్రతి ఒక్కరి బాధను వింటూ పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. ప్రజల అవసరాలు తీర్చి, వారికి జవాబుదారీతనంగా ఉండటమే తమ లక్ష్యమని వివరించారు. ‘మీ కోసం మేము ఉన్నాం’ అనే భావనను అధికారులు ప్రజలకు కల్పించాలని ఆదేశించారు.
News December 11, 2024
మైనార్టీలపై దాడులు.. బంగ్లాదేశ్ కీలక ప్రకటన
బంగ్లాలో హిందువులు, మైనార్టీలపై దాడుల నేపథ్యంలో ఆ దేశం కీలక ప్రకటన చేసింది. ఆగస్ట్ 5 నుంచి అక్టోబర్ 22 వరకు 88 మతపరమైన హింసాత్మక దాడులు జరిగినట్లు వెల్లడించింది. 70మందిని అరెస్ట్ చేసినట్లు స్పష్టం చేసింది. ఆ తర్వాత జరిగిన దాడులపై త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామంది. ఇటీవల భారత విదేశీ వ్యవహారాల కార్యదర్శి విక్రమ్ మిస్రీ బంగ్లా తాత్కాలిక సారథి యూనస్‌ను కలిసిన నేపథ్యంలో వివరాలు వెల్లడించారు.