News November 23, 2024

మహారాష్ట్రలో NDA, ఝార్ఖండ్‌లో INDIA

image

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో NDA కూటమి ఆధిక్యంలో కొనసాగుతోంది. అక్కడ NDA 217 లీడ్‌లో ఉంది. అటు ఝార్ఖండ్లో మాత్రం INDIA కూటమి ఆధిక్యం కనబరుస్తోంది. INDIA 50 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. ఇదే లీడ్ చివరి వరకూ కొనసాగితే ఆయా రాష్ట్రాల్లో గత ప్రభుత్వాలే మళ్లీ కొలువుదీరే అవకాశం ఉంది.

Similar News

News January 10, 2026

‘గోదావరి’ఖనిలో రెండో మహా జాతర..!

image

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణ (జనగామ) శివారులోని గోదావరి నది తీరాన వెలిసిన శ్రీ సమ్మక్క- సారక్క జాతర తెలంగాణ రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద జాతరగా ప్రసిద్ధి చెందింది. మేడారం కోయ పూజారుల ఆధ్వర్యంలో మాఘ శుద్ధ పౌర్ణమిలో మూడు రోజుల పాటు జరిగే ఈ మహా జాతరకు ఉమ్మడి KNR, ఆదిలాబాద్ జిల్లాలోని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవార్లకు నిలువెత్తు బంగారం, ఎదురుకోళ్లు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు.

News January 10, 2026

గ్రీన్‌లాండ్‌పై డెన్మార్క్‌కు ట్రంప్ వార్నింగ్

image

గ్రీన్‌లాండ్‌ను సొంతం చేసుకోవడంపై US అధ్యక్షుడు ట్రంప్ డెన్మార్క్‌కు మరోసారి వార్నింగ్ ఇచ్చారు. ‘వారికి నచ్చినా నచ్చకపోయినా గ్రీన్‌లాండ్‌పై మేమో నిర్ణయానికి వచ్చాం. ఈజీగా ఒక డీల్ చేసుకోవాలి అనుకుంటున్నాం. అది సాధ్యం కాకపోతే కష్టమైన దారిని ఎంచుకోవాల్సి వస్తుంది. ఆ పని మేము చేయకపోతే రష్యా, చైనా చేస్తాయి. అందుకు అమెరికా సిద్ధంగా లేదు. ఏదేమైనా గ్రీన్‌లాండ్ విషయంలో వెనక్కి తగ్గం’ అని స్పష్టం చేశారు.

News January 10, 2026

NHIDCLలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

<>NHIDCL<<>>లో 64 అసోసియేట్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే (JAN 12) ఆఖరు తేదీ. సివిల్ ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. జీతం నెలకు రూ.70,000-రూ.80,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.nhidcl.com