News November 23, 2024

మహారాష్ట్రలో NDA, ఝార్ఖండ్‌లో INDIA

image

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో NDA కూటమి ఆధిక్యంలో కొనసాగుతోంది. అక్కడ NDA 217 లీడ్‌లో ఉంది. అటు ఝార్ఖండ్లో మాత్రం INDIA కూటమి ఆధిక్యం కనబరుస్తోంది. INDIA 50 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. ఇదే లీడ్ చివరి వరకూ కొనసాగితే ఆయా రాష్ట్రాల్లో గత ప్రభుత్వాలే మళ్లీ కొలువుదీరే అవకాశం ఉంది.

Similar News

News December 7, 2024

బ్రిక్స్ కరెన్సీపై ప్రతిపాదనలు లేవు: జైశంకర్

image

US డాల‌ర్‌తో పోటీ ప‌డేందుకు బ్రిక్స్ దేశాల‌ కొత్త క‌రెన్సీ తెచ్చే విష‌య‌మై నిర్ణ‌యం తీసుకోలేద‌ని విదేశాంగ మంత్రి జైశంక‌ర్ స్ప‌ష్టం చేశారు. $ విలువ‌ తగ్గింపుపై భారత్‌కు ఆస‌క్తి లేద‌ని తేల్చిచెప్పారు. భార‌త్‌కు అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగ‌స్వామి అని, బ్రిక్స్ కరెన్సీపై ఎలాంటి ప్ర‌తిపాద‌న‌లు లేవ‌న్నారు. కాగా బ్రిక్స్ దేశాలు కొత్త క‌రెన్సీ తెస్తే 100% టారిఫ్‌లు విధిస్తామ‌ని ట్రంప్ గతంలో హెచ్చరించారు.

News December 7, 2024

ఏటా డిసెంబర్ 15న ఆత్మార్పణ దినం

image

AP: ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు వర్ధంతి (డిసెంబర్ 15)ని ఏటా ఆత్మార్పణ దినంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆయన జీవిత చరిత్రపై పిల్లలకు క్విజ్, వ్యాసరచనలో పోటీలు పెట్టాలని తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

News December 7, 2024

GOOD NEWS: LIC స్కాలర్‌షిప్ స్కీమ్.. రేపటి నుంచి దరఖాస్తులు

image

టెన్త్/ఇంటర్/డిప్లొమాలో కనీసం 60% మార్కులు సాధించిన పేద విద్యార్థుల కోసం LIC గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ స్కీమ్‌ను లాంచ్ చేసింది. రేపటి నుంచి ఈనెల 22 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనుంది. 2021-22, 2022-23, 2023-24 విద్యాసంవత్సరాల్లో పాసైన వారు, 2024-25లో ఫస్టియర్ చదువుతున్న వారు అర్హులు.
వెబ్‌సైట్: <>https://licindia.in/<<>>