News November 23, 2024
BGT: టీ బ్రేక్ సమయానికి భారత్ 84/0
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఫస్ట్ టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్లు ఆచితూచి ఆడుతున్నారు. దీంతో భారత్ టీ బ్రేక్ సమయానికి 26 ఓవర్లు ఆడి 84/0గా నిలిచింది. క్రీజులో జైస్వాల్(42), KL రాహుల్(34) ఉన్నారు. ప్రస్తుతానికి భారత్ 130 రన్స్ లీడ్‌లో ఉంది.
Similar News
News November 27, 2024
మాపై లంచాల ఆరోపణలే లేవు: DOJ, SECపై అదానీ గ్రూప్ ఫైర్
భారత అధికారులకు లంచాలు ఇచ్చినట్టు US డిస్ట్రిక్ట్ కోర్టు తమ ప్రతినిధుల్లో ఎవ్వరిపైనా అభియోగాలు నమోదు చేయలేదని <<14721709>>అదానీ<<>> గ్రూప్ వివరించింది. అజూర్ పవర్, CDPQ ప్రతినిధులైన రంజిత్, సిరిల్, సౌరభ్, , దీపక్, రూపేశ్‌పై ఆరోపణలు చేసినట్టు తెలిపింది. తమ ప్రతినిధులపై ఎలాంటి ఎవిడెన్సూ DOJ చూపలేదని విమర్శించింది. ఎవరో చెప్పింది విని చర్యలు తీసుకోవడం చట్టపరంగా, నైతికంగా DOJ, SEC దిగజారుడు తత్వానికి నిదర్శనమంది.
News November 27, 2024
అదానీపై US కోర్టు కేసులో ఊహించని ట్విస్ట్
అదానీపై US డిస్ట్రిక్ట్ కోర్టు కేసులో మరో టర్న్. గౌతమ్ అదానీ, సాగర్ అదానీ, వినీత్ జైన్‌పై US DOJ లంచం, అవినీతి అభియోగాలు నమోదే చేయలేదని అదానీ గ్రూప్ తెలిపింది. ఫారిన్ కరప్షన్, లంచాలపై భారత్, అమెరికా మీడియా చేస్తున్న ప్రచారం అబద్ధమని స్పష్టం చేసింది. మొత్తం 5 అభియోగాల్లో వారిపై మూడే నమోదయ్యాయని తెలిపింది. సెక్యూరిటీస్ ఫ్రాడ్ కుట్ర, వైర్ ఫ్రాడ్ కుట్ర, సెక్యూరిటీ ఫ్రాడ్ ఆరోపణలే ఉన్నాయంది.
News November 27, 2024
క్విక్ కామర్స్.. కిరాణా షాపులకు దెబ్బేనా?
10 నిమిషాల్లోపే డెలివరీ చేసే క్విక్ కామర్స్ వ్యాపారం దేశంలో విస్తరిస్తోంది. ఇప్పటికే జొమాటోకు చెందిన బ్లింకిట్, స్విగ్గీకి చెందిన ఇన్‌స్టామార్ట్, జెప్టో, ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన మినట్స్, బిగ్ బాస్కెట్, ఫోన్ పేకి చెందిన పిన్‌కోడ్, జియో మార్ట్ ఉండగా అమెజాన్ కూడా Tez పేరుతో ఈ రంగంలోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ క్విక్ కామర్స్ వల్ల కిరాణా షాపులకు ముప్పు కలిగే ఛాన్స్ ఉందని వ్యాపార వర్గాల అంచనా.