News November 27, 2024
క్విక్ కామర్స్.. కిరాణా షాపులకు దెబ్బేనా?
10 నిమిషాల్లోపే డెలివరీ చేసే క్విక్ కామర్స్ వ్యాపారం దేశంలో విస్తరిస్తోంది. ఇప్పటికే జొమాటోకు చెందిన బ్లింకిట్, స్విగ్గీకి చెందిన ఇన్‌స్టామార్ట్, జెప్టో, ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన మినట్స్, బిగ్ బాస్కెట్, ఫోన్ పేకి చెందిన పిన్‌కోడ్, జియో మార్ట్ ఉండగా అమెజాన్ కూడా Tez పేరుతో ఈ రంగంలోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ క్విక్ కామర్స్ వల్ల కిరాణా షాపులకు ముప్పు కలిగే ఛాన్స్ ఉందని వ్యాపార వర్గాల అంచనా.
Similar News
News December 11, 2024
ఇంకా జోరు తగ్గని ‘దేవర’
ఎన్టీఆర్ ‘దేవర’ మూవీ విడుదలై మూడు నెలలు దాటినా జోరు కొనసాగిస్తోంది. ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఆ వేదికపై అత్యధికంగా వీక్షించిన రెండో దక్షిణాది చిత్రంగా నిలిచింది. వరుసగా 5వారాల పాటు టాప్ 10లో ట్రెండ్ అవుతోందని దేవర మూవీ టీమ్ తెలిపింది. ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా కొరటాల శివ తెరకెక్కించిన ఈ మూవీ వరల్డ్‌వైడ్ రూ.500 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడం విశేషం.
News December 11, 2024
ట్రంప్‌కు కాబోయే కోడలికి కీలక పదవి
అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనకు కాబోయే కోడలికి కీలక పదవి కట్టబెట్టారు. డొనాల్డ్ ట్రంప్ జూనియర్ ఫియాన్సీ కింబర్లీ గిల్ఫోయిల్‌ను గ్రీస్‌కు US రాయబారిగా నియమించారు. కింబర్లీ గతంలో ఫాక్స్ న్యూస్ హోస్ట్‌గా పనిచేశారు. 2020లో ట్రంప్ జూనియర్‌తో నిశ్చితార్థం జరిగింది. కాగా జూనియర్ ట్రంప్ ఇప్పటికే వానెసాతో పెళ్లై విడాకులు తీసుకున్నారు. వీరిద్దరికీ ఐదుగురు పిల్లలు ఉన్నారు.
News December 11, 2024
GOOGLE: ప్రపంచంలో రెండో వ్యక్తిగా పవన్ కళ్యాణ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రపంచవ్యాప్తంగా GOOGLE అత్యధికంగా శోధించిన రెండవ నటుడిగా అవతరించారు. 2024లో ఎక్కువగా సెర్చ్ చేసిన నటుల జాబితాను సంస్థ విడుదల చేసింది. ఇందులో హాస్యనటుడు కాట్ విలియమ్స్ అగ్రస్థానంలో నిలిచారు. నటుడిగా, రాజకీయ వేత్తగా ఈ ఏడాది పవన్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలవడంతో ఆయన గురించి తెలుసుకునేందుకు తెగ సెర్చ్ చేశారు. ఈ జాబితాలో భారత్ నుంచి హీనా ఖాన్, నిమ్రత్ కౌర్ కూడా ఉండటం విశేషం.