News November 23, 2024

కొత్త వంగడాలు, ఆవిష్కరణలతో స్టాళ్లు: సీఎం రేవంత్

image

TG: ప్రజా ప్రభుత్వ విజయోత్సవాల్లో భాగంగా ఈ నెల 30న మహబూబ్‌నగర్‌లో నిర్వహించనున్న రైతు సదస్సుపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు, సాంకేతిక పరిజ్ఞాన వినియోగంపై రైతులకు అవగాహన కల్పించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. వర్సిటీలు అభివృద్ధి చేసిన కొత్త వంగడాలు, ఆయిల్ పామ్ కంపెనీల ఆవిష్కరణలు, నూతన ఉత్పాదకాలతో 3 రోజులు స్టాళ్లు ఏర్పాటుచేయాలని సూచించారు.

Similar News

News October 15, 2025

అక్టోబర్ 15: చరిత్రలో ఈ రోజు

image

1931: మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలామ్(ఫొటోలో) జననం
1933: డైరెక్టర్ పి.చంద్రశేఖర్ రెడ్డి జననం
1939: నటుడు జీ రామకృష్ణ జననం
1953: ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి జననం
1986: హీరో సాయి దుర్గా తేజ్ జననం
1986: బాలీవుడ్ నటుడు అలీ ఫజల్ జననం
2022: సినీ నిర్మాత కాట్రగడ్డ మురారి మరణం
*ప్రపంచ విద్యార్థుల దినోత్సవం
*గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే

News October 15, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News October 15, 2025

UN HRC మెంబర్స్‌గా ఇండియా, పాకిస్థాన్

image

ఐక్యరాజ్య సమితి 2026-28కి గాను హ్యూమన్ రైట్స్ కౌన్సిల్‌ను ఎన్నుకుంది. మెంబర్స్‌గా అంగోలా, చిలీ, ఈక్వెడార్, ఈజిప్ట్, ఎస్టోనియా, ఇండియా, ఇరాక్, ఇటలీ, మారిషస్, పాక్, స్లోవేనియా, SA, UK, వియత్నాంను ఎన్నుకుంది. నిత్యం మానవ హక్కులను కాలరాసే పాక్‌లాంటి దేశానికి UN హ్యూమన్ రైట్స్ కౌన్సిల్‌లో చోటు దక్కడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది సరైన నిర్ణయం కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.