News November 23, 2024
కొత్త వంగడాలు, ఆవిష్కరణలతో స్టాళ్లు: సీఎం రేవంత్
TG: ప్రజా ప్రభుత్వ విజయోత్సవాల్లో భాగంగా ఈ నెల 30న మహబూబ్‌నగర్‌లో నిర్వహించనున్న రైతు సదస్సుపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు, సాంకేతిక పరిజ్ఞాన వినియోగంపై రైతులకు అవగాహన కల్పించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. వర్సిటీలు అభివృద్ధి చేసిన కొత్త వంగడాలు, ఆయిల్ పామ్ కంపెనీల ఆవిష్కరణలు, నూతన ఉత్పాదకాలతో 3 రోజులు స్టాళ్లు ఏర్పాటుచేయాలని సూచించారు.
Similar News
News December 13, 2024
భార్యాబాధితుడి సూసైడ్: భార్య ఆఫీస్ ముందు మగాళ్ల ఆందోళన
భార్యాబాధితుడు అతుల్ <<14841616>>సూసైడ్<<>> నిశ్శబ్ద విప్లవం సృష్టిస్తోంది! ‘జస్టిస్ ఫర్ అతుల్ సుభాష్’ అంటూ మగవాళ్లు నినదిస్తున్నారు. బెంగళూరులో అతడి భార్య నికిత పనిచేసే అసెంచర్ ఆఫీస్ ముందు వందలాది IT ఉద్యోగులు కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. హైదరాబాద్, కోల్‌కతా అసెంచర్ ఆఫీసులు, ఢిల్లీ జంతర్ మంతర్ వద్దకు టెకీలు రావాలని పిలుపునిస్తూ అక్కడక్కడా పోస్టర్లు వెలిశాయి. జెండర్ న్యూట్రల్ చట్టాల కోసం డిమాండ్లు పెరిగాయి.
News December 13, 2024
ఈ నెల 16న క్యాబినెట్ భేటీ
TG: ఈ నెల 16న సీఎం రేవంత్ అధ్యక్షతన క్యాబినెట్ భేటీ జరుగనుంది. అసెంబ్లీలో కమిటీ హాల్‌లో జరిగే మంత్రివర్గ సమావేశంలో పలు చట్ట సవరణ బిల్లులకు క్యాబినెట్ ఆమోదం పలుకుతుందని తెలుస్తోంది.
News December 13, 2024
నేటి ‘గూగుల్’ డూడుల్ గమనించారా?
దేశం మొత్తం సెలబ్రేట్ చేసుకుంటున్న ‘వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్’ విజయాన్ని ‘గూగుల్’ తనదైన శైలిలో జరుపుకుంది. తన డూడుల్‌ను చెస్ కాయిన్స్‌గా మార్చేసింది. ‘64 నలుపు & తెలుపు చతురస్రాల్లో ఇద్దరు ఆటగాళ్లు ఆడిన వ్యూహాత్మక గేమ్‌ను తలపించేలా డూడుల్‌ను రూపొందించాం’ అని గూగుల్ తెలిపింది. కాగా, నిన్న జరిగిన ఛాంపియన్షిప్‌లో భారత చెస్ ప్లేయర్ గుకేశ్ గెలుపొంది సత్తాచాటారు.