News November 23, 2024

దేశాధ్యక్షుడిని హత్య చేయిస్తాను: ఫిలిప్పీన్స్ ఉపాధ్యక్షురాలు

image

తానే చనిపోయే పరిస్థితి వస్తే.. దేశాధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ దంపతులను, ప్రతినిధుల సభ స్పీకర్‌ను హత్య చేయించనున్నట్లు ఫిలిప్పీన్స్ ఉపాధ్యక్షురాలు సారా డుటెర్టే సంచలన ప్రకటన చేశారు. అందుకోసం ఓ కిల్లర్‌తో కాంట్రాక్ట్ చేసుకున్నట్లు తెలిపారు. 2022లో ఎన్నికలు గెలిచిన సారా, ఫెర్డినాండ్, ఆ తర్వాత బద్ధశత్రువులుగా మారారు. అధ్యక్షుడు తనను చంపించేందుకు చూస్తున్నారనేది సారా ఆరోపణ.

Similar News

News November 24, 2024

208 ఓట్ల తేడాతో గెలిచిన మహా కాంగ్రెస్ చీఫ్

image

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి ఘోర పరాజయం మూట కట్టుకోగా ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ నానా పటోలే కొద్ది ఓట్ల తేడాతో గట్టెక్కారు. సకోలి స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి అవినాష్ బ్రహ్మంకర్‌పై 208 ఓట్ల తేడాతో గెలుపొందారు. పటోలేకు 96,795 ఓట్లు రాగా, బ్రహ్మంకర్‌కు 96,587 ఓట్లు వచ్చాయి. ఓవరాల్‌గా అత్యల్ప మెజారిటీ MIM అభ్యర్థి ముఫ్తీ మహ్మద్ ఖలీక్‌(162 ఓట్లు)ది కావడం గమనార్హం.

News November 24, 2024

తెలుగు టైటాన్స్‌కు ఐదో పరాజయం

image

ప్రో కబడ్డీ లీగ్‌లో గుజరాత్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచులో తెలుగు టైటాన్స్ 31-28 పాయింట్ల తేడాతో ఓటమి పాలైంది. TTలో విజయ్ 15 పాయింట్లు, గుజరాత్‌లో ప్రతీక్ 11 పాయింట్లు సాధించారు. ఇప్పటివరకు 13 మ్యాచులు ఆడిన తెలుగు టైటాన్స్ 8 విజయాలతో రెండో స్థానంలో ఉంది. మొదటి స్థానంలో హరియాణా స్టీలర్స్ కొనసాగుతోంది.

News November 24, 2024

నవంబర్ 24: చరిత్రలో ఈరోజు

image

1897: హాస్యనటుడు వంగర వెంకటసుబ్బయ్య జననం
1880: ఆంధ్రా బ్యాంకు వ్యవస్థాపకుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య జననం(ఫొటోలో)
1924: సినీ దర్శకుడు తాతినేని ప్రకాశరావు జననం
1952: భారత మాజీ క్రికెటర్ బ్రిజేష్ పటేల్ జననం
1953: రచయిత యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ జననం
1961: భారతీయ రచయిత్రి అరుంధతీ రాయ్ జననం
2018: కన్నడ నటుడు, మాజీ కేంద్రమంత్రి అంబరీష్ మరణం
* అంతర్జాతీయ ఎవల్యూషన్ డే