News November 23, 2024

దేశాధ్యక్షుడిని హత్య చేయిస్తాను: ఫిలిప్పీన్స్ ఉపాధ్యక్షురాలు

image

తానే చనిపోయే పరిస్థితి వస్తే.. దేశాధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ దంపతులను, ప్రతినిధుల సభ స్పీకర్‌ను హత్య చేయించనున్నట్లు ఫిలిప్పీన్స్ ఉపాధ్యక్షురాలు సారా డుటెర్టే సంచలన ప్రకటన చేశారు. అందుకోసం ఓ కిల్లర్‌తో కాంట్రాక్ట్ చేసుకున్నట్లు తెలిపారు. 2022లో ఎన్నికలు గెలిచిన సారా, ఫెర్డినాండ్, ఆ తర్వాత బద్ధశత్రువులుగా మారారు. అధ్యక్షుడు తనను చంపించేందుకు చూస్తున్నారనేది సారా ఆరోపణ.

Similar News

News December 14, 2024

తొక్కిసలాటలో గాయపడిన బాలుడిని పరామర్శించిన బన్నీ వాసు

image

TG: సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో గాయపడిన బాలుడిని నిర్మాత బన్నీ వాసు పరామర్శించారు. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడి ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైద్య ఖర్చులు తామే భరిస్తామని, బాధిత కుటుంబానికి అండగా ఉంటామని మరోసారి హామీ ఇచ్చారు. అల్లు అర్జున్‌కు బన్నీ వాసు సన్నిహితుడనేది తెలిసిందే. నిన్న ఈ ఘటనపై నమోదైన కేసులోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టై బెయిల్‌పై విడుదలయ్యారు.

News December 14, 2024

గబ్బాలో కూడా ఆస్ట్రేలియానే గెలుస్తుంది: పాంటింగ్

image

బ్రిస్బేన్(గబ్బా)లో భారత్, ఆస్ట్రేలియా సమ ఉజ్జీలుగా పోరాడతాయని, చివరికి విజయం మాత్రం కంగారూలనే వరిస్తుందని ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ జోస్యం చెప్పారు. ‘తొలి రెండు మ్యాచులు చూసిన తర్వాత ఈ సిరీస్‌లో ఫలితం ఎలా ఉండనుందన్నది అంచనా వేయడం చాలా కష్టంగా మారింది. భారత్ రికార్డు ఇక్కడ బాగుంది. కానీ ఆస్ట్రేలియా 40 ఏళ్లలో 2 సార్లే ఓడింది. కాబట్టి ఆసీస్‌దే తుది విజయం’ అని పేర్కొన్నారు.

News December 14, 2024

వారంలో ఎస్సీ వర్గీకరణపై నివేదిక: సీఎం రేవంత్

image

TG: ఎస్సీ వర్గీకరణకు తమ పార్టీ అనుకూలమని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. HYDలో గ్లోబల్ మాదిగ డే-2024లో ఆయన పాల్గొన్నారు. ‘వారం రోజుల్లో ఎస్సీ వర్గీకరణపై షమీమ్ అక్తర్ కమిషన్ నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. ఇబ్బందులు రాకుండా వర్గీకరణ చేస్తాం. రాజకీయ, అధికార నియామకాల్లో మాదిగలకు ప్రాధాన్యం ఇస్తున్నాం. చరిత్రలో తొలిసారిగా ఉస్మానియా యూనివర్సిటీ వీసీగా మాదిగ వ్యక్తిని నియమించాం’ అని CM చెప్పారు.