News November 24, 2024

208 ఓట్ల తేడాతో గెలిచిన మహా కాంగ్రెస్ చీఫ్

image

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి ఘోర పరాజయం మూట కట్టుకోగా ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ నానా పటోలే కొద్ది ఓట్ల తేడాతో గట్టెక్కారు. సకోలి స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి అవినాష్ బ్రహ్మంకర్‌పై 208 ఓట్ల తేడాతో గెలుపొందారు. పటోలేకు 96,795 ఓట్లు రాగా, బ్రహ్మంకర్‌కు 96,587 ఓట్లు వచ్చాయి. ఓవరాల్‌గా అత్యల్ప మెజారిటీ MIM అభ్యర్థి ముఫ్తీ మహ్మద్ ఖలీక్‌(162 ఓట్లు)ది కావడం గమనార్హం.

Similar News

News November 24, 2024

భారీ స్కోర్‌పై భారత్ కన్ను

image

BGTలో భాగంగా ఆస్ట్రేలియాతో తొలి టెస్టు 2వ ఇన్నింగ్స్‌లో భారీ స్కోరుపై భారత్ కన్నేసింది. జైస్వాల్(90), KL రాహుల్(62) రాణింపుతో 172/0తో పటిష్ఠమైన స్థితిలో రెండో రోజు ఆట ముగించింది. ప్రస్తుతం 218 లీడ్‌లో ఉన్న భారత్ 3వ రోజంతా బ్యాటింగ్ చేసి కంగారూల ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశిస్తే ఆసీస్‌పై ఒత్తిడి పెరిగే ఛాన్సుంది. మరి భారత్ ఎంత స్కోర్ కొడుతుందని మీరు భావిస్తున్నారు? కామెంట్ చేయండి.

News November 24, 2024

CM కుర్చీ కోసం ‘ముగ్గురు మొనగాళ్లు’

image

మహారాష్ట్రలో BJP నేతృత్వంలోని మహాయుతికి 230 సీట్లతో స్పష్టమైన మెజారిటీ వచ్చింది. కూటమిలోని BJP 149 స్థానాల్లో పోటీ చేయగా 132 గెలిచింది. శివసేన 81లో 57, NCP 59లో 41 గెలిచింది. కాగా తమ నేత ఫడణవీస్‌ CM కావడం పక్కా అని BJP అంటుంటే, శిండే నేతృత్వంలోని శివసేన సైతం CM విషయంలో తగ్గేదేలే అంటోంది. అటు NCP అజిత్ పవార్‌ కూడా CM కుర్చీ త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపించట్లేదు.

News November 24, 2024

డిసెంబర్ 1 నుంచి ప్రజాపాలన విజయోత్సవాలు

image

TG: అధికారం చేపట్టి ఏడాది పూర్తికావస్తున్న సందర్భంగా DEC 1-9 వరకు ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించాలని CM రేవంత్ నిర్ణయించారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ఉత్సవ వాతావరణం ఉట్టిపడాలని, అన్ని శాఖలు భాగస్వామ్యం కావాలని ఆదేశించారు. స్కూళ్లు, కాలేజీలు, హాస్టళ్లలోనూ వేడుకలు జరపాలన్నారు. తొలి ఏడాది ప్రభుత్వ విజయాలతో పాటు భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలను వివరించాలని అధికారులకు సూచించారు.