News November 24, 2024

208 ఓట్ల తేడాతో గెలిచిన మహా కాంగ్రెస్ చీఫ్

image

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి ఘోర పరాజయం మూట కట్టుకోగా ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ నానా పటోలే కొద్ది ఓట్ల తేడాతో గట్టెక్కారు. సకోలి స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి అవినాష్ బ్రహ్మంకర్‌పై 208 ఓట్ల తేడాతో గెలుపొందారు. పటోలేకు 96,795 ఓట్లు రాగా, బ్రహ్మంకర్‌కు 96,587 ఓట్లు వచ్చాయి. ఓవరాల్‌గా అత్యల్ప మెజారిటీ MIM అభ్యర్థి ముఫ్తీ మహ్మద్ ఖలీక్‌(162 ఓట్లు)ది కావడం గమనార్హం.

Similar News

News December 4, 2024

గ్రూప్-4 అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసిన సీఎం

image

TG: గ్రూప్-4 ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందజేశారు. పెద్దపల్లిలో నిర్వహించిన ‘యువ వికాసం’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అంతకుముందు ఆయన పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. కాగా ఏటూరు నాగారం, పెద్దపల్లికి బస్ డిపోలు మంజూరు చేస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు.

News December 4, 2024

రేవంత్ దేవుళ్లపై ఒట్లు వేయడం వల్లే భూకంపం వచ్చింది: కౌశిక్ రెడ్డి

image

TG: CM రేవంత్ దేవుళ్లపై ఒట్లు వేయడం వల్లే రాష్ట్రంలో భూకంపం వచ్చిందని BRS MLA పాడి కౌశిక్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. CM పాపాల నుంచి ప్రజలను దేవుళ్లే కాపాడాలన్నారు. మరోవైపు తన ఫోన్‌ను ట్యాప్ చేస్తున్నారని కౌశిక్ ఆరోపించారు. ఇటీవల తాను ఓ మిత్రుడి పార్టీకి వెళ్తే ఫోన్ ట్యాప్ చేయించి, అక్కడికి పోలీసులను పంపించారన్నారు. తన వద్ద డ్రగ్స్ పెట్టించి కేసులో ఇరికించాలని చూశారని మండిపడ్డారు.

News December 4, 2024

డిప్యూటీ సీఎం పదవికి అంగీకరించిన శిండే

image

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం పదవి తీసుకునేందుకు ఏక్‌నాథ్ శిండే అంగీకరించారు. ఆయన ఇంటికి వెళ్లి సీఎం అభ్యర్థి ఫడణవీస్ చర్చించడంతో బాధ్యతలు చేపట్టేందుకు ఒప్పుకున్నారు. రేపు ఆయన ఫడణవీస్‌తో కలిసి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అజిత్ పవార్ కూడా డిప్యూటీగా ప్రమాణం చేయనున్న సంగతి తెలిసిందే.