News November 24, 2024
IPL వేలం: ఇతనిపైనే అందరి చూపు
ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు ఐపీఎల్ మెగా వేలం ప్రారంభం కానుంది. ఈ క్రమంలో భారత స్టార్ ప్లేయర్ రిషభ్ పంత్‌పై అందరి దృష్టి ఉంది. ఈ వేలంలో ఆయనే అత్యధిక ధర పలుకుతారని అంచనా వేస్తున్నారు. రాహుల్, శ్రేయస్, అర్ష్‌దీప్, ఇషాన్, షమీ వంటి ప్లేయర్లు కూడా అధిక ధర పలికే అవకాశముంది. గత సీజన్‌లో స్టార్క్ అత్యధికంగా రూ.24.75 కోట్ల ధర పలకగా ఈసారి సరికొత్త రికార్డులు నమోదవుతాయని క్రీడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Similar News
News November 24, 2024
WhatsAppలో కొత్త ఫీచర్.. ఇక సీక్రెట్‌గా చదువుకోవచ్చు
ఆడియో సందేశాలను Text రూపంలోకి మార్చే కొత్త ఫీచర్ వాట్సాప్‌లో త్వరలో అందుబాటులోకి రానుంది. కీలక సమావేశాల్లో ఉన్నప్పుడు వచ్చే ఆడియో సందేశాలు, ఎవరూ వినకూడదనుకున్న వాటిని టెక్ట్స్ రూపంలోకి కన్వర్ట్ చేసుకొని చదువుకోవచ్చు. దీనిని Settings-Chats-Transcription ఆప్షన్‌ను ఉపయోగించి ఎనేబుల్ చేసుకోవచ్చు. అనంతరం ఆడియో మెసేజ్‌లపై లాంగ్ ప్రెస్ చేసి Text ఫార్మాట్‌లోకి మార్చుకోవచ్చు.
News November 24, 2024
28న ‘గేమ్ ఛేంజర్’ నుంచి థర్డ్ సింగిల్
రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా నటిస్తోన్న గేమ్ ఛేంజర్ మూవీ నుంచి మరో అప్డేట్ వచ్చింది. ఈ నెల 28న థర్డ్ సింగిల్ విడుదల చేస్తున్నట్లు సోషల్ మీడియాలో ఓ పోస్టర్ ద్వారా మేకర్స్ ప్రకటించారు. శంకర్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీలో అంజలి కీలకపాత్ర పోషిస్తున్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 10న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
News November 24, 2024
రెండు రాష్ట్రాల్లో DBTలు పనిచేశాయి
MH, ఝార్ఖండ్ ఎన్నికల్లో అధికార పార్టీలు గెలవడం వెనుక DBT పథకాలు పనిచేసినట్టు స్పష్టమవుతోంది. MHలో లడ్కీ బెహెన్, ఝార్ఖండ్‌లో CM మయ్యా సమ్మాన్ యోజన పథకాల ద్వారా మహిళలకు నెలవారీ ఆర్థిక సాయం ఫలితాలపై ప్రభావం చూపింది. పైగా ప్రస్తుతం ఇస్తున్న ₹1,500ను ₹2,100కు పెంచుతామని మహాయుతి ప్రకటించింది. అలాగే ₹1000 సాయాన్ని ₹2,500కు పెంచుతామని హేమంత్ సోరెన్ హామీ ఇవ్వడం కలిసొచ్చింది.