News November 24, 2024
IPL వేలం: ఇతనిపైనే అందరి చూపు
ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు ఐపీఎల్ మెగా వేలం ప్రారంభం కానుంది. ఈ క్రమంలో భారత స్టార్ ప్లేయర్ రిషభ్ పంత్‌పై అందరి దృష్టి ఉంది. ఈ వేలంలో ఆయనే అత్యధిక ధర పలుకుతారని అంచనా వేస్తున్నారు. రాహుల్, శ్రేయస్, అర్ష్‌దీప్, ఇషాన్, షమీ వంటి ప్లేయర్లు కూడా అధిక ధర పలికే అవకాశముంది. గత సీజన్‌లో స్టార్క్ అత్యధికంగా రూ.24.75 కోట్ల ధర పలకగా ఈసారి సరికొత్త రికార్డులు నమోదవుతాయని క్రీడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Similar News
News December 2, 2024
లోక్‌సభ, రాజ్యసభ రేపటికి వాయిదా
పార్లమెంట్ ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. ఇవాళ ఉదయం లోక్‌సభ, రాజ్యసభలు ప్రారంభం కాగానే అదానీ అంశంపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. స్పీకర్, ఛైర్మన్ సముదాయించినా విపక్ష ఎంపీలు వినలేదు. అదానీ అంశంపై చర్చకు కేంద్రం ఎందుకు భయపడుతోందని ప్రశ్నిస్తూ నినాదాలు చేశారు. దీంతో ఉభయ సభలను స్పీకర్, ఛైర్మన్ రేపటికి వాయిదా వేశారు.
News December 2, 2024
హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాల్లో కీర్తి సురేశ్ పెళ్లి!
టాలీవుడ్ ‘మహానటి’ కీర్తి సురేశ్ & ఆంటోనీల వివాహం గోవాలో ఈనెల 12న జరగనున్నట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాల్లో వివాహం జరగనుంది. మూడు రోజుల పాటు వివాహం జరగనుండగా, 10న ప్రీవెడ్డింగ్, 11న సంగీత్ నిర్వహించనున్నారు. 12న ఉదయం కీర్తి మెడలో ఆంటోనీ తాళి కట్టనుండగా అదేరోజు సాయంత్రం స్థానిక చర్చిలో మరోసారి వెడ్డింగ్ జరగనుంది. కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే పాల్గొననున్నారు.
News December 2, 2024
అధికారులు అప్రమత్తంగా ఉండాలి: అనిత
AP: ‘ఫెంగల్’ తుఫాను ప్రభావిత జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి అనిత ఆదేశించారు. అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. స్వర్ణముఖి నది సహా నాయుడుపేట, పెళ్లకూరు, ఓజిలి మండలాల్లో పొంగిపొర్లుతున్న వాగులు, వంకల పరిసరాల ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. తిరుపతి, తిరుమలలో కొండచరియలు జారిపడుతున్న నేపథ్యంలో భక్తులు, ప్రజల రాకపోకలు, భద్రతపై దృష్టి పెట్టాలని చెప్పారు.