News November 24, 2024
డిసెంబర్ 1 నుంచి ప్రజాపాలన విజయోత్సవాలు
TG: అధికారం చేపట్టి ఏడాది పూర్తికావస్తున్న సందర్భంగా DEC 1-9 వరకు ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించాలని CM రేవంత్ నిర్ణయించారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ఉత్సవ వాతావరణం ఉట్టిపడాలని, అన్ని శాఖలు భాగస్వామ్యం కావాలని ఆదేశించారు. స్కూళ్లు, కాలేజీలు, హాస్టళ్లలోనూ వేడుకలు జరపాలన్నారు. తొలి ఏడాది ప్రభుత్వ విజయాలతో పాటు భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలను వివరించాలని అధికారులకు సూచించారు.
Similar News
News November 24, 2024
రెండు రాష్ట్రాల్లో DBTలు పనిచేశాయి
MH, ఝార్ఖండ్ ఎన్నికల్లో అధికార పార్టీలు గెలవడం వెనుక DBT పథకాలు పనిచేసినట్టు స్పష్టమవుతోంది. MHలో లడ్కీ బెహెన్, ఝార్ఖండ్‌లో CM మయ్యా సమ్మాన్ యోజన పథకాల ద్వారా మహిళలకు నెలవారీ ఆర్థిక సాయం ఫలితాలపై ప్రభావం చూపింది. పైగా ప్రస్తుతం ఇస్తున్న ₹1,500ను ₹2,100కు పెంచుతామని మహాయుతి ప్రకటించింది. అలాగే ₹1000 సాయాన్ని ₹2,500కు పెంచుతామని హేమంత్ సోరెన్ హామీ ఇవ్వడం కలిసొచ్చింది.
News November 24, 2024
విశాఖలో రైల్వే జోనల్ కార్యాలయం నిర్మాణానికి టెండర్ల ఆహ్వానం
AP: విశాఖలో దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటులో కీలక ముందడుగు పడింది. స్థానికంగా జోనల్ కార్యాలయం ఏర్పాటుకు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ టెండర్లను ఆహ్వానించారు. రెండు సెల్లార్ల పార్కింగ్ ఫ్లోర్లతో కలిపి మొత్తం 11 అంతస్తుల భవన నిర్మాణం చేపట్టనున్నారు. అయితే 9 ఫ్లోర్ల నిర్మాణానికి టెండర్లు దాఖలు చేయాలని మంత్రి ట్వీట్ చేశారు.
News November 24, 2024
IPL వేలంలో ఆంధ్రా కుర్రాళ్లు వీరే
IPL 2025 మెగా వేలంలో పలువురు తెలుగు ఆటగాళ్లు తమ పేరు నమోదు చేసుకున్నారు. ఇవాళ, రేపు జరగబోయే ఆక్షన్‌లో వీరు తమ అదృష్టం పరీక్షించుకోనున్నారు. వీరిలో షేక్ రషీద్, బైలపూడి యశ్వంత్, అశ్విన్ హెబ్బర్, పృథ్వీరాజ్, PVSN రాజు, మారంరెడ్డి హేమంత్ రెడ్డి, మనీశ్ రెడ్డి, యద్దెల గిరీశ్ రెడ్డి, గిరినాథ్ రెడ్డి ఉన్నారు. వీరందరి బేస్ ప్రైజ్ రూ.30 లక్షలుగా ఉంది. వీరిలో మీ జిల్లా ప్లేయర్ ఎవరో కామెంట్ చేయండి.