News November 24, 2024
డిసెంబర్ 1 నుంచి ప్రజాపాలన విజయోత్సవాలు
TG: అధికారం చేపట్టి ఏడాది పూర్తికావస్తున్న సందర్భంగా DEC 1-9 వరకు ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించాలని CM రేవంత్ నిర్ణయించారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ఉత్సవ వాతావరణం ఉట్టిపడాలని, అన్ని శాఖలు భాగస్వామ్యం కావాలని ఆదేశించారు. స్కూళ్లు, కాలేజీలు, హాస్టళ్లలోనూ వేడుకలు జరపాలన్నారు. తొలి ఏడాది ప్రభుత్వ విజయాలతో పాటు భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలను వివరించాలని అధికారులకు సూచించారు.
Similar News
News December 8, 2024
టెన్త్, ఇంటర్ పాసైన వారికి గుడ్‌న్యూస్
TG: సికింద్రాబాద్‌లోని జోగిందర్ స్టేడియం, AOC సెంటర్‌లో 2025 JAN 6 నుంచి MAR 9 వరకు అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ జరగనుంది. జనరల్ డ్యూటీ, ఆఫీస్ అసిస్టెంట్, చెఫ్, ట్రేడ్స్‌మెన్ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేస్తారు. జనరల్ డ్యూటీ, ట్రేడ్స్‌మెన్‌కు టెన్త్, ఆఫీస్ అసిస్టెంట్‌కు ఇంటర్ పాసైన వారు అర్హులు. వయసు 17-21 ఏళ్లు ఉండాలి. వివరాలకు tuskercrc2021@gov.in మెయిల్, joinindianarmy@nic.inను సందర్శించండి.
News December 8, 2024
రేపు చలో అసెంబ్లీ: సర్పంచుల JAC
TG: పెండింగ్ బిల్లులు చెల్లించాలనే డిమాండ్‌తో రేపు అసెంబ్లీని ముట్టడించనున్నట్లు సర్పంచుల జేఏసీ ప్రకటించింది. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సర్పంచులంతా అసెంబ్లీని ముట్టడిస్తారని జేఏసీ అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ హెచ్చరించారు. శాసనసభ సమావేశాల్లో పెండింగ్ బిల్లులపై చర్చించాలని, సమావేశాలు ముగిసేలోగా రూ.500కోట్ల బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
News December 8, 2024
‘ఏపీలో 3వేల మంది బాలికల అదృశ్యం’.. CSకు NHRC సమన్లు
AP: రాష్ట్రంలో 3వేల మంది బాలికలు అదృశ్యమయ్యారని అందిన ఫిర్యాదు విషయంలో సీఎస్‌కు NHRC సమన్లు జారీ చేసింది. దీనిపై నివేదికలు పంపాలని రిమైండర్లు పంపినా స్పందించకపోవడంపై మండిపడింది. పూర్తి సమాచారం, డాక్యుమెంట్లతో జనవరి 20లోపు తమ ముందు వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది. బాలికల మిస్సింగ్‌పై ఓ ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్త ఆధారంగా ఓ సామాజిక కార్యకర్త గత జనవరిలో కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.