News November 24, 2024

మోదీకి అదానీ, జగన్ అనుకూలం: నారాయణ

image

AP: ముడుపుల వ్యవహారంలో అదానీపై అమెరికాలో కేసు నమోదైనందున ఆ కంపెనీతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. ప్రధాని మోదీకి అదానీ, మాజీ సీఎం జగన్ అనుకూలంగా ఉన్నారని ఆరోపించారు. రూ.1,750 కోట్ల ముడుపులు ఇచ్చి రూ.లక్ష కోట్ల భారాన్ని ప్రజలపై మోపేందుకు గత ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని విమర్శించారు. దీనిపై దర్యాప్తు సంస్థలతో విచారణ చేయించాలని కోరారు.

Similar News

News November 24, 2024

DEC 2 నుంచి కొత్త రేషన్‌కార్డులకు దరఖాస్తులు

image

AP: కొత్త రేషన్‌కార్డులకు డిసెంబర్ 2 నుంచి దరఖాస్తులను స్వీకరించేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. కార్డుల్లో మార్పులు, కొత్తగా పెళ్లయిన వారు అప్లై చేసుకోవడానికి వీలుగా ఆప్షన్లను ఇవ్వనుంది. పాత కార్డుల స్థానంలో రీడిజైన్ కార్డుల జారీకి చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది. జనవరి నుంచి కొత్త కార్డుల జారీ ప్రక్రియ మొదలుపెట్టి నెల రోజుల్లో పూర్తిచేయనుంది.

News November 24, 2024

క్వింటన్ డికాక్‌కు రూ.3.60కోట్లు

image

వికెట్ కీపర్ బ్యాటర్ క్వింటన్ డికాక్‌‌ను KKR రూ.3.60కోట్లకు కొనుగోలు చేసింది. ఇతని కోసం ముంబై, KKR, SRH పోటీ పడ్డాయి. గత సీజన్లో లక్నో తరఫున ఆడిన ఇతను రూ.2కోట్ల బేస్ ప్రైజ్‌తో ఆక్షన్‌లోకి వచ్చారు. డికాక్‌ ఐపీఎల్ కెరీర్లో 107 మ్యాచులు ఆడి 3157 రన్స్ చేశారు. ఇతడి స్ట్రైక్ రేట్ 134గా ఉంది. డికాక్‌‌ వికెట్ కీపింగ్‌తో పాటు భారీ ఇన్నింగ్స్ ఆడగలరు.

News November 24, 2024

ఎవర్నీ కొనట్లేదేంటి భయ్యా!

image

జట్లన్నీ పోటీపడి ఆటగాళ్లను సొంతం చేసుకుంటుంటే ముంబై ఇండియన్స్ మాత్రం ఐపీఎల్ వేలంలో సైలెంట్‌గా ఉండిపోయింది. ఇప్పటి వరకు 24మంది ప్లేయర్స్ కొనుగోలు అవ్వగా, ఒక్కరినీ కూడా ఆ టీం తీసుకోలేదు. దీంతో ఆ టీమ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు. అసలు వేలానికి ఎందుకొచ్చారని మండిపడుతున్నారు. ఇకనైనా ఆ జట్టు ప్లేయర్స్‌ను కొనుగోలు చేస్తుందేమో చూడాలి. ముంబై జట్టు ఖాతాలో రూ.45కోట్లు ఉన్నాయి.