News November 24, 2024

మోదీకి అదానీ, జగన్ అనుకూలం: నారాయణ

image

AP: ముడుపుల వ్యవహారంలో అదానీపై అమెరికాలో కేసు నమోదైనందున ఆ కంపెనీతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. ప్రధాని మోదీకి అదానీ, మాజీ సీఎం జగన్ అనుకూలంగా ఉన్నారని ఆరోపించారు. రూ.1,750 కోట్ల ముడుపులు ఇచ్చి రూ.లక్ష కోట్ల భారాన్ని ప్రజలపై మోపేందుకు గత ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని విమర్శించారు. దీనిపై దర్యాప్తు సంస్థలతో విచారణ చేయించాలని కోరారు.

Similar News

News December 8, 2024

కేసీఆర్ వారసుడెవరు? కేటీఆర్ సమాధానమిదే

image

TG: బీఆర్ఎస్ పార్టీ చీఫ్ కేసీఆర్‌కు వారసుడెవరనే ప్రశ్నకు కేటీఆర్ బదులిచ్చారు. గులాబీ బాసే మరో మూడు-నాలుగేళ్లలో సీఎం అవుతారని చెప్పారు. ప్రజలు, పార్టీనే వారసుడిని నిర్ణయిస్తుందని తెలిపారు. కేసీఆర్ వంటి నాయకుడి కింద పనిచేయడమే తమ అదృష్టమన్నారు. తిరిగి KCRను సీఎంగా చూడటమే తన లక్ష్యమన్నారు. ఎవరి స్థాయికి తగ్గట్లుగా వారికి పార్టీలో బాధ్యతలు ఉన్నాయని పేర్కొన్నారు.

News December 8, 2024

చైతూ భర్తగా రావడం నా అదృష్టం: శోభిత

image

నాగ చైతన్య సింప్లిసిటీ, మంచి మనసు తనను ఆకట్టుకున్నాయని భార్య శోభితా ధూళిపాళ వెల్లడించారు. అలాంటి వ్యక్తి భర్తగా రావడం తన అదృష్టమని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అతను హుందాగా, ప్రశాంతంగా ఉంటాడని, మర్యాదగా ప్రవర్తిస్తాడని పేర్కొన్నారు. ఎలాంటి ప్రేమ కోసమైతే ఎదురుచూశానో అది చైతూ నుంచి దక్కిందన్నారు. తనను జాగ్రత్తగా చూసుకుంటాడని తెలిపారు. ఈ ప్రేమ జంట ఈ నెల 4న పెళ్లితో ఒక్కటైన విషయం తెలిసిందే.

News December 8, 2024

రేవంత్ ఏడాది పాటు వారి కోసమే పనిచేశారు: కేటీఆర్

image

TG: రాష్ట్రంలో మాజీ సర్పంచ్ నుంచి మాజీ సీఎం వరకు అందరిపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతుందని కేటీఆర్ అన్నారు. ప్రతి గ్రామంలో 60% పైన ప్రజలు కాంగ్రెస్‌పై దుమ్మెత్తి పోస్తున్నారని చెప్పారు. ప్రజల్లో వ్యతిరేకత లేదని కాంగ్రెస్ నేతలు చెప్పగలరా అని ప్రశ్నించారు. మూసీ వెనుక మూటల దోపిడీ ఉందని దుయ్యబట్టారు. రేవంత్ ఈ ఏడాది పాలనలో అదానీ, బావమరిది, బ్రదర్స్ కోసమే పనిచేశారని ఆరోపించారు.