News November 24, 2024
చెన్నైకి రాహుల్ త్రిపాఠి
రాహుల్ త్రిపాఠిని చెన్నై సూపర్ కింగ్స్ రూ.3.40కోట్లకు కొనుగోలు చేసింది. ఇతను రూ.75లక్షల బేస్ ప్రైజ్‌తో ఆక్షన్‌లోకి వచ్చారు. త్రిపాఠి గత సీజన్లో SRH తరఫున ఆడారు. టాప్ ఆర్డర్లో త్రిపాఠి బిగ్ హిట్స్ కొట్టగలరు.
Similar News
News November 25, 2024
అంత డబ్బుకు నేను అర్హుడినే: చాహల్
ఐపీఎల్ వేలంలో స్పిన్నర్ చాహల్‌ను రూ.18 కోట్లకు పంజాబ్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. దానిపై చాహల్ హర్షం వ్యక్తం చేశారు. ‘ముందు టెన్షన్‌గా అనిపించింది. గడచిన మూడేళ్లలో వచ్చిన డబ్బు ఒకే ఏడాదిలో వస్తుంది. పంజాబ్ నాకోసం చూస్తోందని కొంతమంది స్నేహితులు ముందే అన్నారు. కానీ ఈ రేంజ్‌లో ఊహించలేదు. బహుశా రూ.12 కోట్లు వస్తాయేమో అనుకున్నా అంతే. కానీ ఈ డబ్బుకు నేను పూర్తిగా అర్హుడినే’ అని తెలిపారు.
News November 24, 2024
ఐపీఎల్ మెగా వేలం UPDATES
* నమన్ ధిర్‌ను రూ.5.25కోట్లకు కొనుగోలు చేసిన MI
* నెహాల్ వధేరాను రూ.4.20కోట్లకు కొనుగోలు చేసిన PBKS
* అభినవ్ మనోహర్‌ను రూ.3.20కోట్లు పెట్టి కొన్న SRH
* రఘువంశిని రూ.3కోట్లకు సొంతం చేసుకున్న KKR
* సమీర్ రిజ్విని రూ.95లక్షలకు దక్కించుకున్న DC
* రూ.30 లక్షలకు అథర్వ తైదెను దక్కించుకున్న SRH
* రూ.50 లక్షలకు కరుణ్ నాయర్‌ను కొన్న DC
News November 24, 2024
మా ఇల్లు బఫర్ జోన్‌లో లేదు: హైడ్రా కమిషనర్
HYD మధురానగర్‌లోని తన ఇల్లు బఫర్ జోన్‌లో లేదని, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు అవాస్తవమని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. 44ఏళ్ల కిందట తన తండ్రి నిర్మించిన ఇంట్లోనే ఉంటున్నామన్నారు. ఒకప్పటి పెద్ద చెరువునే 25 ఏళ్ల క్రితం కృష్ణకాంత్ పార్కుగా మార్చారని చెప్పారు. ఆ పార్క్‌కు తమ ఇంటికి మధ్య కి.మీ. దూరం ఉందని వివరించారు. చెరువు కట్ట దిగువన 10 మీటర్లు దాటితే బఫర్ జోన్ పరిధిలోకి రాదన్నారు.