News November 24, 2024

చెన్నైకి రాహుల్ త్రిపాఠి

image

రాహుల్ త్రిపాఠిని చెన్నై సూపర్ కింగ్స్ రూ.3.40కోట్లకు కొనుగోలు చేసింది. ఇతను రూ.75లక్షల బేస్ ప్రైజ్‌తో ఆక్షన్‌లోకి వచ్చారు. త్రిపాఠి గత సీజన్లో SRH తరఫున ఆడారు. టాప్ ఆర్డర్లో త్రిపాఠి బిగ్ హిట్స్ కొట్టగలరు.

Similar News

News December 12, 2024

BREAKING: భీకర ఎన్‌కౌంటర్.. 12 మంది మృతి

image

మావోయిస్టులకు మరో షాక్ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లోని అబూజ్‌మడ్ అటవీ ప్రాంతంలో భీకర ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో 12 మంది మావోయిస్టులు మరణించారు. ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌లోనూ ఏడుగురు మావోలు ప్రాణాలు కోల్పోయారు.

News December 12, 2024

టూరిస్టులు లేక దీనస్థితిలో గోవా!

image

ఇండియన్ టూరిజం ఇబ్బందుల్లో ఉంది. ముఖ్యంగా ఎప్పుడూ పర్యాటకులతో కళకళలాడే గోవాలో ప్రస్తుతం సందడి తగ్గింది. ఈ ఏడాది గోవాలో తక్కువ మంది పర్యటించినట్లు తెలుస్తోంది. భారత టూరిస్టులంతా థాయ్‌లాండ్, మలేషియాకు వెళ్తున్నారు. గోవాలో సరైన పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు లేకపోవడం, టాక్సీల దోపిడీ వల్ల టూరిస్టులు వచ్చేందుకు మొగ్గు చూపట్లేదని హోటల్ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News December 12, 2024

సినీ నటుడు మోహన్ బాబుపై మరో ఫిర్యాదు

image

మీడియాపై దాడి చేసిన సినీ నటుడు మోహన్ బాబుపై కేసు నమోదు చేయాలని హైకోర్టు న్యాయవాది అరుణ్ కుమార్ పహాడీ షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘మంచు విష్ణు నటిస్తున్న ఓ మూవీ ప్రమోషన్ల కోసమే వారు డ్రామా ఆడుతున్నారు. మోహన్ బాబుతోపాటు ఆయన కుమారులు విష్ణు, మనోజ్‌పై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయాలి’ అని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇప్పటికే మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదైన సంగతి తెలిసిందే.