News November 25, 2024
శివసేన శాసనసభాపక్ష నేతగా షిండే
మహారాష్ట్ర సీఎం అభ్యర్థిపై ఇంకా సస్పెన్స్ వీడలేదు. శివసేన షిండే వర్గం ఏక్నాథ్ షిండేను పార్టీ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంది. ఓ హోటల్లో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యేలంతా ఆయనను ఎన్నుకుంటూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. అంతకుముందు అజిత్ పవార్‌ను ఎన్సీపీ శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్న సంగతి తెలిసిందే. రేపటితో ప్రభుత్వ పదవికాలం పూర్తి కానుండటంతో ఆ లోపే సీఎం అభ్యర్థిపై స్పష్టత వచ్చే అవకాశముంది.
Similar News
News November 25, 2024
ప్చ్.. ఆర్సీబీ మళ్లీ అంతే!
RCB మేనేజ్మెంట్ తీరుపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పర్స్ మనీ ఎక్కువగా ఉన్నా మంచి ప్లేయర్లను కొనుగోలు చేయలేదని మండిపడుతున్నారు. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ హేజిల్‌వుడ్‌కు రూ.12.50 కోట్లు చాలా ఎక్కువ అని.. స్టార్క్, షమీ, నటరాజన్ లాంటి బౌలర్లను కొనాల్సిందంటున్నారు. ప్రస్తుతం RCBలో సుయాశ్ శర్మ, యశ్ దయాల్, రసిక్ సలాం లాంటి సాధారణ బౌలర్లే ఉన్నారు. మరి ఇవాళ RCB ఎలాంటి ప్లాన్స్ వేస్తుందో చూడాలి.
News November 25, 2024
దివ్యాంగుల పోస్టులపై కేంద్రం మార్గదర్శకాలు
దివ్యాంగులకు పోస్టులను కాలానుగుణంగా గుర్తించడానికి కమిటీలను తప్పనిసరి చేయాలని కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు కనీసం 40% వైకల్యం ఉన్న వ్యక్తులకు రిజర్వేషన్లు, పోస్టుల గుర్తింపును క్రమబద్ధీకరించడానికి మార్గదర్శకాలు జారీ చేసింది. ఏదైనా పోస్టు వారికి సరిపోతుందని భావిస్తే, తదుపరి ప్రమోషనల్ పోస్టులు దివ్యాంగులకు రిజర్వ్ చేయాలని తెలిపింది. వైకల్య నిర్ధారణకు ఏకరీతి మార్గదర్శకాలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది.
News November 25, 2024
ఏడు రాష్ట్రాల అసెంబ్లీల్లో ప్రతిపక్షం లేదు
దేశంలో ప్రతిపక్ష హోదా లేని అసెంబ్లీల సంఖ్య ఏడుకు చేరింది. ఇప్పటికే AP, అరుణాచల్, గుజరాత్, మణిపుర్, నాగాలాండ్, సిక్కిం ఈ జాబితాలో ఉండగా తాజాగా మహారాష్ట్ర చేరింది. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా దక్కాలంటే మొత్తం MLA స్థానాల్లో పది శాతం సీట్లను దక్కించుకోవాలి. మహారాష్ట్రలో 288 సీట్లు ఉండగా 29 సీట్లు గెలవాల్సి ఉంది. అయితే శివసేన(UBT)కు 20, కాంగ్రెస్‌కు 16, NCP(SP)కి 10 స్థానాలు మాత్రమే వచ్చాయి.