News November 25, 2024
శివసేన శాసనసభాపక్ష నేతగా షిండే
మహారాష్ట్ర సీఎం అభ్యర్థిపై ఇంకా సస్పెన్స్ వీడలేదు. శివసేన షిండే వర్గం ఏక్‌నాథ్ షిండేను పార్టీ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంది. ఓ హోటల్‌లో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యేలంతా ఆయనను ఎన్నుకుంటూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. అంతకుముందు అజిత్ పవార్‌ను ఎన్సీపీ శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్న సంగతి తెలిసిందే. రేపటితో ప్రభుత్వ పదవికాలం పూర్తి కానుండటంతో ఆ లోపే సీఎం అభ్యర్థిపై స్పష్టత వచ్చే అవకాశముంది.
Similar News
News December 11, 2024
గజగజ.. మళ్లీ పెరిగిన చలి
తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు మళ్లీ పడిపోతున్నాయి. గతనెల నుంచే చలి తీవ్రత విపరీతంగా మొదలైన విషయం తెలిసిందే. ఆ తర్వాత బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ వల్ల ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. TGలోనూ మోస్తరు వానలు, ఆకాశం మబ్బు పట్టడం వల్ల చలి బాగా తగ్గిపోయింది. కానీ గత 2 రోజులుగా చలి మళ్లీ పెరిగింది. రానున్న రోజుల్లో మరింత తీవ్రం కానుందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
News December 11, 2024
స్కూళ్లకు మూడు రోజులు సెలవులు
క్రిస్మస్ సందర్భంగా స్కూళ్లకు మూడు రోజులు సెలవులు ఇస్తూ TG ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 24న క్రిస్మస్ ఈవ్, 25న క్రిస్మస్, 26న బాక్సింగ్ డే నేపథ్యంలో సెలవులుగా పేర్కొంది. గతంలో క్రిస్మస్‌కు 5 రోజులు సెలవులు ఇవ్వగా ఈసారి ప్రభుత్వం 3 రోజులకు కుదించింది. మరోవైపు ఏపీలో 24, 26న ఆప్షనల్ హాలిడే, 25న జనరల్ హాలిడే ఉండనుంది.
News December 11, 2024
మెహుల్ చోక్సీ ఆస్తుల వేలం!
ఆర్థిక నేరస్థుడు మెహుల్ చోక్సీ ఆస్తులు వేలం వేయడానికి ఈడీ సిద్ధమైంది. అతడికి చెందిన రూ.2,500కోట్లు విలువైన సొత్తును అక్రమాస్తుల నిరోధక చట్టం కింద ఈడీ ఇప్పటికే స్వాధీనం చేసుకుంది. కాగా, ఈ ఆస్తుల వేలం ద్వారా వచ్చే మొత్తాన్ని PNB, ICICI బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలని ఈడీ కోర్టు ఇప్పటికే ఆదేశించింది. తప్పుడు పత్రాలతో PNBకి రూ.13వేల కోట్లు కుచ్చుటోపీ పెట్టిన మెహుల్ చోక్సీ విదేశాలకు పరారయ్యారు.