News November 25, 2024
వచ్చే నెలలో రెండు ఇస్రో ప్రయోగాలు

డిసెంబర్ నెలలో షార్ నుంచి ఇస్రో రెండు ప్రయోగాలను చేపట్టనుంది. 4వ తేదీన PSLV C59 రాకెట్ ద్వారా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోభా-3 అనే శాటిలైట్‌తో పాటు మరో 4 చిన్నతరహా ఉపగ్రహాలను వాణిజ్యపరంగా ప్రయోగించనుంది. 24వ తేదీన PSLV C60 ద్వారా రిశాట్-1B సహా నాలుగు వాణిజ్యపరమైన ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపేందుకు సైంటిస్టులు సన్నాహాలు చేస్తున్నారు.
Similar News
News September 19, 2025
ఈ నెల 22 నుంచి దసరా సెలవులు: లోకేశ్

AP: దసరా సెలవులపై విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ గుడ్ న్యూస్ చెప్పారు. ఉపాధ్యాయుల కోరిక మేరకు ఈ నెల 22 నుంచి అక్టోబర్ 2 వరకు పండుగ సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించారు. విద్యాశాఖ అధికారులతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నామని ట్వీట్ చేశారు. కాగా అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఈ నెల 24 నుంచి అక్టోబర్ 2 వరకు హాలిడేస్ ఉన్నాయి. తాజాగా మార్చడంతో అదనంగా రెండు రోజులు సెలవులు రానున్నాయి.
News September 19, 2025
3 వారాలు గడిచినా CBI నుంచి నో రిప్లై!

TG: NDSA (నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ) నివేదిక ఆధారంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై దర్యాప్తు చేయాలని రాష్ట్రప్రభుత్వం కోరినా <<17577217>>సీబీఐ<<>> స్పందించట్లేదు. సెప్టెంబర్ 2న రాసిన లేఖకు ఇప్పటివరకు సమాధానం ఇవ్వలేదు. సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ హైదరాబాద్‌ను సందర్శించినా సర్కారుకు ఎలాంటి సమాచారం అందలేదు. కాగా సీబీఐ రిప్లై కోసం ప్రభుత్వం ఎదురు చూస్తోందని ఉన్నతాధికారులు వే2న్యూస్‌తో తెలిపారు.
News September 19, 2025
ఏపీలో గోల్డ్ మైన్.. త్వరలో పసిడి ఉత్పత్తి!

AP: కర్నూల్(D) జొన్నగిరి వద్ద తాము అభివృద్ధి చేస్తున్న గనిలో త్వరలో పసిడి ఉత్పత్తిని ప్రారంభిస్తామని దక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ కంపెనీ MD హనుమప్రసాద్ వెల్లడించారు. పర్యావరణ అనుమతులు వచ్చాయని, రాష్ట్ర ప్రభుత్వం అనుమతివ్వగానే ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తామన్నారు. ఇదే జరిగితే దేశంలో గనుల నుంచి బంగారాన్ని తీసే తొలి ప్రైవేట్ కంపెనీగా DGML నిలవనుంది. ఏటా 750-1000kgs గోల్డ్ ఉత్పత్తి అవుతుందని అంచనా.