News November 25, 2024

వచ్చే నెలలో రెండు ఇస్రో ప్రయోగాలు

image

డిసెంబర్ నెలలో షార్ నుంచి ఇస్రో రెండు ప్రయోగాలను చేపట్టనుంది. 4వ తేదీన PSLV C59 రాకెట్ ద్వారా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోభా-3 అనే శాటిలైట్‌తో పాటు మరో 4 చిన్నతరహా ఉపగ్రహాలను వాణిజ్యపరంగా ప్రయోగించనుంది. 24వ తేదీన PSLV C60 ద్వారా రిశాట్-1B సహా నాలుగు వాణిజ్యపరమైన ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపేందుకు సైంటిస్టులు సన్నాహాలు చేస్తున్నారు.

Similar News

News December 11, 2024

‘ఉపాధి’ కూలి రోజుకు రూ.300

image

AP: ఉపాధి హామీ పథకం కూలీలకు రోజుకు రూ.300 ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటివరకు రూ.255 కూలి ఇస్తుండగా దీనిని రూ.300కు పెంచేందుకు CM చంద్రబాబు, Dy.CM పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారు. పనులు ఎలా చేపడితే రూ.300 కూలి వస్తుందో కూలీలు, మేట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లకు ఇప్పటికే అవగాహన కల్పించారు. దీనిపై కలెక్టర్లు, డ్వామా PDలకు పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణ తేజ ఉత్తర్వులు జారీ చేశారు.

News December 11, 2024

BITCOIN: 3 రోజుల్లో రూ.5.5 లక్షల నష్టం

image

క్రిప్టో కరెన్సీ మార్కెట్లో బలహీనత కనిపిస్తోంది. ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణే ఇందుకు కారణం. లక్ష డాలర్ల స్థాయిని తాకాక బిట్‌కాయిన్ క్రమంగా పతనమవుతోంది. 3 రోజుల్లోనే $6500 (Rs 5.5L) మేర నష్టపోయింది. ఇవాళ $96,593 వద్ద మొదలైన BTC $539 నష్టంతో $96,093 వద్ద ట్రేడవుతోంది. Mcap $1.94 ట్రిలియన్ల నుంచి $1.91 ట్రిలియన్లకు తగ్గింది. ETH, USDT, XRP, SOL, BNP, DOGE, USDC, ADA, TRX కాయిన్లూ నష్టాల్లోనే ఉన్నాయి.

News December 11, 2024

‘రైతుభరోసా’ కోసం కోకాపేట భూముల తాకట్టు?

image

TG: రైతు భరోసా కోసం అవసరమైన నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి సమకూరినట్లు తెలుస్తోంది. రూ.10 వేల కోట్లు ఇచ్చేందుకు ICICI బ్యాంకు అంగీకరించినట్లు సమాచారం. కోకాపేట, రాయదుర్గంలోని TGIICకి చెందిన 400 ఎకరాల భూములను తాకట్టు పెట్టినట్లు తెలుస్తోంది. ఆడిటింగ్ పూర్తి చేసి RBIకి ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది. ఇందులో రూ.8 వేల కోట్లు రైతుభరోసాకు, రూ.2 వేల కోట్లు పదవీ విరమణ ఉద్యోగుల ప్రయోజనాలకు ఖర్చు చేయనుంది.