News November 25, 2024
బిహార్ విఫల రాష్ట్రం.. చెత్తలో కూరుకుపోయింది: ప్రశాంత్ కిశోర్
బిహార్‌లో 4 స్థానాలకు జరిగిన బైఎలక్షన్‌లో ఘోర ఓటమి తర్వాత జన సురాజ్ లీడర్ ప్రశాంత్ కిశోర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. USలోని బిహారీలతో వర్చువల్‌గా మాట్లాడుతూ ‘బిహార్ ఒక విఫల రాష్ట్రం. అది చెత్తలో కూరుకుపోయింది. సుడాన్‌లో 20ఏళ్లుగా సివిల్ వార్ జరుగుతోంది. అక్కడ ప్రజలు పిల్లల చదువుల గురించి పట్టించుకోరు. అలాంటి పరిస్థితే ఇక్కడా ఉంది. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రయత్నాలు తీవ్రతరం చేయాలి’ అని చెప్పారు.
Similar News
News November 25, 2024
మంత్రి లోకేశ్‌తో చాగంటి భేటీ
AP: విద్యార్థుల నైతిక విలువల సలహాదారుగా నియమితులైన ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు మంత్రి నారా లోకేశ్‌ను ఉండవల్లిలోని ఆయన నివాసంలో కలిశారు. మహిళలు, పెద్దలు, గురువులపై విద్యార్థుల్లో గౌరవం పెంపొందించేలా ప్రత్యేకంగా పాఠ్యాంశాలు రూపొందించాలని ఈ సందర్భంగా ఇరువురు నిర్ణయించినట్లు లోకేశ్ తెలిపారు. ఇందుకు తనవంతు సలహాలు, సహకారం అందిస్తానని చాగంటి కోటేశ్వరరావు చెప్పారు.
News November 25, 2024
తెలుగు ఆటగాడు శ్రీకర్ భరత్‌కు షాక్
ఐపీఎల్ మెగా వేలంలో తెలుగు ఆటగాడు శ్రీకర్ భరత్‌ను ఎవరూ కొనలేదు. రూ.75 లక్షల బేస్ ప్రైజ్‌తో వేలంలోకి వచ్చిన ఆయనపై ఎవరూ ఆసక్తి చూపలేదు. అలాగే న్యూజిలాండ్ క్రికెటర్ డారెల్ మిచెల్ అన్‌సోల్డ్‌గా మిగిలారు. ఇంగ్లండ్ విధ్వంసకర ప్లేయర్ జానీ బెయిర్‌స్టో, విండీస్ ప్లేయర్ షయ్ హోప్‌ను కూడా ఎవరూ కొనలేదు.
News November 25, 2024
WTC: మళ్లీ భారత్ నంబర్-1
తొలి టెస్టులో ఆసీస్‌పై ఘన విజయంతో భారత్ WTC పాయింట్ల పట్టికలో మళ్లీ అగ్రస్థానానికి చేరుకుంది. 9 విజయాలు, 5 ఓటములతో 61.11 శాతంతో టాప్‌లో ఉంది. ఆస్ట్రేలియా(57.69 శాతం) రెండో స్థానానికి పడిపోయింది. ఆ తర్వాత వరుసగా శ్రీలంక(55.56%), కివీస్(54.55%), సౌతాఫ్రికా(54.17%), ఇంగ్లండ్(40.79%), పాక్(33.33%), బంగ్లాదేశ్(27.50%), విండీస్(18.52%) ఉన్నాయి.