News November 25, 2024

బిహార్ విఫల రాష్ట్రం.. చెత్తలో కూరుకుపోయింది: ప్రశాంత్ కిశోర్

image

బిహార్‌లో 4 స్థానాలకు జరిగిన బైఎలక్షన్‌లో ఘోర ఓటమి తర్వాత జన సురాజ్ లీడర్ ప్రశాంత్ కిశోర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. USలోని బిహారీలతో వర్చువల్‌గా మాట్లాడుతూ ‘బిహార్ ఒక విఫల రాష్ట్రం. అది చెత్తలో కూరుకుపోయింది. సుడాన్‌లో 20ఏళ్లుగా సివిల్ వార్ జరుగుతోంది. అక్కడ ప్రజలు పిల్లల చదువుల గురించి పట్టించుకోరు. అలాంటి పరిస్థితే ఇక్కడా ఉంది. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రయత్నాలు తీవ్రతరం చేయాలి’ అని చెప్పారు.

Similar News

News December 5, 2024

ప్రపంచంలోనే మోదీ తెలివైనోడు: కువైట్ మంత్రి

image

భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచంలోనే తెలివైనవారిలో ఒకరని కువైట్ విదేశాంగ మంత్రి అలీ అల్ యాహ్యా ప్రశంసించారు. తమకు ఎంతో విలువైన భాగస్వామి అని ఆయన కొనియాడారు. ‘నన్ను భారత్‌కు ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. మోదీ ఈ దేశాన్ని ఒక మంచి దశలో ఉంచుతారు. భారత్‌తో మా సంబంధాలు ఎప్పటికీ కొనసాగుతాయి’ అని ఆయన పేర్కొన్నారు. కాగా ఇరు దేశాల సంబంధాలను బలపరిచేందుకు యాహ్యా ఇక్కడికి వచ్చారు.

News December 5, 2024

సౌతాఫ్రికా కెప్టెన్‌గా హెన్రిచ్ క్లాసెన్

image

పాకిస్థాన్‌తో T20 సిరీస్ కోసం సౌతాఫ్రికా జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు హెన్రిచ్ క్లాసెన్ నాయకత్వం వహిస్తారు. మార్క్‌రమ్, జాన్సెన్, మహరాజ్, స్టబ్స్, రబడ వంటి సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చారు. జట్టు: క్లాసెన్, క్రూగర్, పీటర్, బార్ట్‌మన్, లిండే, రికెల్‌టన్, బ్రెట్జ్‌కీ, మఫాకా, షంషీ, ఫెర్రీరా, మిల్లర్, సైమ్‌లైన్, హెండ్రిక్స్, నోకియా, డస్సెన్. ఈ నెల 10 నుంచి ఇరు జట్ల మధ్య సిరీస్ ప్రారంభం కానుంది.

News December 5, 2024

కిమ్ జోంగ్ ఉన్‌లా చంద్రబాబు ధోరణి: VSR

image

AP: CM చంద్రబాబు ధోరణి ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్‌లా ఉందని YCP MP విజయసాయిరెడ్డి మండిపడ్డారు. CM నియంతృత్వ ధోరణితో YCP నేతలు, కార్యకర్తలను వేధిస్తున్నారని ట్వీట్ చేశారు. ‘చంద్రబాబు ప్రభుత్వం అణచివేత చర్యలు ఆయన పిరికితనానికి నిదర్శనం. ఆయన రాజకీయ ప్రతీకారానికి ఎలాంటి జస్టిఫికేషన్ లేదు. ప్రజలు జీవించే హక్కు కోల్పోయి అధికార పార్టీ దయాదాక్షిణ్యాలపై ఆధారపడి బతుకుతున్నారు’ అని ఆయన ఫైర్ అయ్యారు.