News November 25, 2024
కులగణన శాస్త్రీయంగా జరగాలి: MLC కవిత
TG: బీసీలకు న్యాయం జరగాలని బీసీ డెడికేటెడ్ కమిషన్ ఛైర్మన్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చినట్లు MLC కవిత చెప్పారు. 2 దశాబ్దాలుగా తెలంగాణ జాగృతి పోరాడుతోందని, BRS బీసీలకు న్యాయం చేసిందన్నారు. రాష్ట్రంలో కులగణన శాస్త్రీయంగా జరగాలని, కామారెడ్డి డిక్లరేషన్ యథాతధంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. చట్టసభలో బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. బీసీలకు న్యాయం జరగాలంటే రాజ్యాంగ సవరణ జరగాలని చెప్పారు.
Similar News
News November 25, 2024
ALERT: రేపు, ఎల్లుండి ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
దక్షిణ బంగాళాఖాతం, తూర్పు హిందూ మహాసముద్రంలో కేంద్రీకృతమైన వాయుగుండం 30కి.మీ వేగంతో కదులుతోందని APSDMA తెలిపింది. రానున్న 24 గంటల్లో ఇది తీవ్ర వాయుగుండంగా బలపడనున్నట్లు పేర్కొంది. దీని ప్రభావంతో రేపు, ఎల్లుండి నెల్లూరు, సత్యసాయి, YSR, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించింది.
News November 25, 2024
‘కలుషిత ఆహారం’ బాధితురాలు శైలజ మృతి
TG: హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చికిత్స పొందుతున్న వాంకిడి ఆశ్రమ పాఠశాల విద్యార్థిని శైలజ(16) మృతి చెందింది. సెప్టెంబర్ 30న కుమ్రంభీం జిల్లా వాంకిడి పాఠశాలలో కలుషిత ఆహారం తిని పలువురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఈక్రమంలోనే శైలజను చికిత్స కోసం నిమ్స్‌లో చేర్చారు. ఇటీవల ఆమెను రాష్ట్ర మంత్రులు, BRS నేతలు పరామర్శించారు. అయితే పరిస్థితి విషమించడంతో కొద్దిసేపటి క్రితమే శైలజ తనువు చాలించింది.
News November 25, 2024
నేను రాజీనామా చేయలేదు: నానా పటోలే
మహారాష్ట్ర పీసీసీ చీఫ్ బాధ్యతల నుంచి తప్పుకున్నట్టు వస్తున్న వార్తలను నానా పటోలే ఖండించారు. 2019లో 44 స్థానాల నుంచి తాజా ఫలితాల్లో కాంగ్రెస్ 16 స్థానాలకు పతనమవ్వడంతో ఓటమికి బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేసినట్టు వార్తలొచ్చాయి. అయితే ఈ వార్తల్లో నిజం లేదని నానా పటోలే స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన మహా వికాస్ అఘాడీ చెక్కుచెదరదని వ్యాఖ్యానించారు.