News November 25, 2024
కులగణన శాస్త్రీయంగా జరగాలి: MLC కవిత
TG: బీసీలకు న్యాయం జరగాలని బీసీ డెడికేటెడ్ కమిషన్ ఛైర్మన్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చినట్లు MLC కవిత చెప్పారు. 2 దశాబ్దాలుగా తెలంగాణ జాగృతి పోరాడుతోందని, BRS బీసీలకు న్యాయం చేసిందన్నారు. రాష్ట్రంలో కులగణన శాస్త్రీయంగా జరగాలని, కామారెడ్డి డిక్లరేషన్ యథాతధంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. చట్టసభలో బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. బీసీలకు న్యాయం జరగాలంటే రాజ్యాంగ సవరణ జరగాలని చెప్పారు.
Similar News
News December 10, 2024
రాజ్యసభ ఛైర్మన్ తొలగింపు నిబంధనలు ఇవే
రాజ్యసభ ఛైర్మన్‌పై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే ఓటింగ్ సందర్భంగా ఆ రోజు సభకు హాజరైనవారిలో సగం కంటే ఎక్కువ మంది మద్దతు అవసరం. రాజ్యసభ ఆమోదం అనంతరం ఇదే తీర్మానం లోక్‌సభలో సాధారణ మెజారిటీతో నెగ్గాలి. ఈ ప్రక్రియ అంతా కూడా Article 67(b), 92, 100 ద్వారా జరుగుతుంది. విపక్షాలకు బలం లేకపోవడంతో రాజ్యసభలో తీర్మానం నెగ్గే పరిస్థితి లేదు.
News December 10, 2024
చలికాలంలో ఈ జ్యూస్ తాగితే…
ఆరోగ్య పరిరక్షణలో ఉసిరిని మించింది లేదని ఆయుర్వేదం చెబుతోంది. పరగడపున దీని జ్యూస్ తాగితే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. చలికాలంలో రెగ్యులర్‌గా తీసుకుంటే జబ్బు పడకుండా కాపాడుతుంది. మెటబాలిజాన్ని మెరుగుపరిచి బరువు తగ్గేందుకు సాయపడుతుంది. ఇందులోని విటమిన్-సి బోలెడంత ఇమ్యూనిటీని ఇస్తుంది. ఉదర సమస్యలు తొలగించి మలబద్ధకాన్ని తరిమేస్తుంది. కాలేయ, కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. స్ట్రెస్‌నూ తొలగిస్తుంది.
News December 10, 2024
HIGH ALERT.. భారీ వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారినట్లు AP విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇది వచ్చే 24 గంటల్లో శ్రీలంక-తమిళనాడు తీరాల వైపు కదులుతుందంది. దీని ప్రభావంతో రేపు NLR, అన్నమయ్య, CTR, TPTY, ELR, కృష్ణా, NTR, GNT, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయంది. ఎల్లుండి నుంచి NLR, ATP, శ్రీసత్యసాయి, YSR, అన్నమయ్య, చిత్తూరు, TPTY జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయంది.