News November 26, 2024
తిరుపతి జూలో 17 ఏళ్ల బెంగాల్ టైగర్ మృతి
AP: తిరుపతిలోని వెంకటేశ్వర జూపార్క్‌లో 17 ఏళ్ల బెంగాల్ టైగర్ మరణించింది. బెంగళూరు నుంచి తీసుకొచ్చిన మధు అనే పెద్దపులి ఆరోగ్య సమస్యలతో చనిపోయినట్లు సిబ్బంది తెలిపారు. గత రెండు నెలలుగా ఈ టైగర్ ఎలాంటి ఆహారం తీసుకోవట్లేదని పేర్కొన్నారు. అవయవాలు దెబ్బతినడం వల్లే పులి మరణించినట్లు వెల్లడించారు. ఈ ఏడాదిలో వెంకటేశ్వర జూపార్కులో మూడు టైగర్స్ చనిపోవడం గమనార్హం.
Similar News
News November 26, 2024
RGV ఎక్కడ?
సోషల్ మీడియాలో పోస్టుల కేసులో RGV పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. నిన్న ఆయనను విచారించేందుకు ఒంగోలు పోలీసులు HYD వచ్చారు. RGV ఇంట్లో లేరని సిబ్బంది వారిని అడ్డుకోవడంతో చాలాసేపు హైడ్రామా నడిచింది. వర్మ ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకున్నట్లు సమాచారం. అయితే ఆయన HYD లేదా కోయంబత్తూరులో ఉన్నారని అనుమానిస్తున్న పోలీసులు గాలింపు చేపట్టారు. అరెస్ట్ చేస్తారనే RGV పోలీసులకు చిక్కకుండా ఉన్నారని వార్తలొస్తున్నాయి.
News November 26, 2024
విశాఖ-ఖరగ్‌పూర్ మధ్య హైవేకు గ్రీన్‌సిగ్నల్
APలోని విశాఖ నుంచి ఖరగ్‌పూర్(బెంగాల్) మధ్య ఒడిశా మీదుగా 783KM మేర ఆరు లేన్ల గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది. గతిశక్తి ప్రాజెక్టులో భాగంగా దీనికి DPR రూపొందించేందుకు NHAI టెండర్లు పిలిచింది. 2025 జూన్ నుంచి పనులు ప్రారంభం కానున్నాయి. ఈ నిర్మాణం పూర్తయితే విశాఖ నుంచి ఖరగ్‌పూర్‌కు 8 గంటల్లోనే చేరుకోవచ్చు. భావనపాడు, గోపాల్‌పూర్, కేంద్ర పారా పోర్టులను ఈ హైవే అనుసంధానిస్తుంది.
News November 26, 2024
సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా ఏపీ: చంద్రబాబు
AP: ఇంటింటికీ సోలార్ ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా తీర్చిదిద్దాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. పైలట్ ప్రాజెక్టుగా కుప్పంలో 100శాతం సౌర విద్యుత్ వినియోగాన్ని అమలు చేయాలన్నారు. రాష్ట్రంలో మొత్తం 132 గ్రామాలను కేవలం సోలార్ విద్యుత్ వినియోగించేలా మార్చాలని సూచించారు. సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటులో పేద ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ప్రాధాన్యం ఇస్తామన్నారు.