News November 26, 2024
తిరుపతి జూలో 17 ఏళ్ల బెంగాల్ టైగర్ మృతి
AP: తిరుపతిలోని వెంకటేశ్వర జూపార్క్‌లో 17 ఏళ్ల బెంగాల్ టైగర్ మరణించింది. బెంగళూరు నుంచి తీసుకొచ్చిన మధు అనే పెద్దపులి ఆరోగ్య సమస్యలతో చనిపోయినట్లు సిబ్బంది తెలిపారు. గత రెండు నెలలుగా ఈ టైగర్ ఎలాంటి ఆహారం తీసుకోవట్లేదని పేర్కొన్నారు. అవయవాలు దెబ్బతినడం వల్లే పులి మరణించినట్లు వెల్లడించారు. ఈ ఏడాదిలో వెంకటేశ్వర జూపార్కులో మూడు టైగర్స్ చనిపోవడం గమనార్హం.
Similar News
News December 2, 2024
విండ్ ఫాల్ టాక్స్ రద్దు చేసిన కేంద్రం
ముడి చమురు ఉత్పత్తుల ఎగుమతులపై విధించే విండ్‌ఫాల్ టాక్స్‌ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈ నిర్ణయం వల్ల రిలయన్స్, ONGC వంటి సంస్థలకు ప్రయోజనం చేకూరనుంది. దేశీయ సంస్థలు ముడి చమురు ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసినప్పుడు ఈ టాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. యుద్ధం, ద్రవ్యోల్బణం వంటి పరిస్థితుల్లో విదేశాల్లో ధరలు పెరిగినప్పుడు ఆ సంస్థలు ఆయా దేశాలకు ఉత్పత్తులను ఎగుమతి చేసి లాభాలు ఆర్జిస్తుంటాయి.
News December 2, 2024
మనుషుల్లానే ఆవులూ ఈ విషయంలో ఒత్తిడికి లోనవుతాయి!
మన సన్నిహితులు మనకు దూరమైతే వెలితిగా ఉన్నట్లే ఆవులకూ ఇలాంటి అనుభూతి కలుగుతుందని నార్తాంప్టన్ విశ్వవిద్యాలయం పరిశోధనలో వెల్లడైంది. ఆవులు నిర్దిష్ట సహచరులతో సన్నిహిత బంధాలను ఏర్పరుచుకుంటాయని, వాటి నుంచి విడిపోయినప్పుడు ఒత్తిడికి లోనవుతాయని తేలింది. ఆవులను ప్రశాంతమైన & ఉదాసీనమైన జీవులుగా భావించవచ్చని పరిశోధన పేర్కొంది. ఈ విషయాన్ని మీ ఇంట్లోని ఆవుల్లో మీరెప్పుడైనా గమనించారా?
News December 2, 2024
రూ.67వేల కోట్ల అప్పు ఏం చేశారు?: బొత్స
AP: కూటమి ప్రభుత్వం గత 6 నెలల్లో ₹67వేల కోట్ల అప్పు చేసిందని, రేపు మరో రూ.4వేల కోట్ల అప్పు తీసుకోబోతోందని YCP MLC బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ అప్పు అంతా దేనికోసం ఖర్చు చేశారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన, కూటమి ప్రభుత్వం పెన్షన్ల పంపిణీ తప్ప మిగతా ఏ హామీలను నెరవేర్చలేదని విమర్శించారు. YCP ప్రభుత్వముంటే ఈ 6నెలల్లో ₹18,000కోట్లు పేదల ఖాతాల్లో వేసే వాళ్లమని చెప్పారు.