News November 26, 2024

ముంబై 26/11 మారణ హోమానికి 16 ఏళ్లు

image

దేశ ఆర్థిక రాజధానిలో మారణ హోమానికి 16 ఏళ్లు. 2008 నవంబర్ 26న సముద్రమార్గం ద్వారా ముంబైలోకి ప్రవేశించిన 10 మంది ఉగ్రవాదులు తాజ్ హోటల్, CSMT, ట్రైడెంట్ ప్రాంతాల్లో బాంబు పేలుళ్లతో పాటు కాల్పులకు తెగబడ్డారు. 170 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, 300 మంది గాయపడ్డారు. భద్రతా బలగాల కాల్పుల్లో 9 మంది దుండగులు చనిపోగా, ఉగ్రవాది కసబ్ సజీవంగా పట్టుబడ్డాడు. అతడిని 2012 నవంబర్ 21న ఉరితీశారు.

Similar News

News September 18, 2025

ఈనెల 22 నుంచి ఓపెన్ స్కూల్ సొసైటీ టెన్త్ ఇంటర్ పరీక్షలు

image

జిల్లాలో టాస్క్ ఓపెన్ స్కూల్స్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించే టెన్త్, ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ రెవిన్యూ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని తన ఛాంబర్‌లో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి, TG ఓపెన్ స్కూలింగ్ సొసైటీ (TOSS) SSC & ఇంటర్ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై ఆయన సమీక్షించారు. పరీక్షలు సెప్టెంబర్ 22 నుంచి 28 వరకు రెండు సెషన్లలో ఉంటాయన్నారు.

News September 18, 2025

ఈ సర్కార్ కార్మికులది.. సమస్యలు పరిష్కరిస్తా: CM రేవంత్

image

TG: హైదరాబాద్‌ను హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నామని ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యుల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అన్ని భాషల సినిమాల షూటింగ్‌లు ఇక్కడ జరిగేలా సహకరించాలని సూచించారు. సమ్మె చేస్తే ఇరువర్గాలకూ నష్టం జరుగుతుందన్నారు. సినీ కార్మికుల తరఫున నిర్మాతలతో ప్రభుత్వం చర్చలు జరుపుతుందని వెల్లడించారు. ఈ సర్కార్ కార్మికులదని, సమస్యలను పరిష్కరించే బాధ్యత తనదని భరోసా ఇచ్చారు.

News September 18, 2025

ఆసియా కప్‌: UAE టార్గెట్ 147 రన్స్

image

ఆసియా కప్‌లో భాగంగా UAEతో మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 146/9 స్కోర్ చేసింది. ఫఖర్ జమాన్ హాఫ్ సెంచరీతో రాణించగా చివర్లో షహీన్ ఆఫ్రిది (29*) బౌండరీలతో స్కోర్ బోర్డును పెంచారు. UAE బౌలర్లలో జునైద్ 4, సిమ్రాన్‌జీత్ సింగ్ 3 వికెట్లు పడగొట్టారు. ఈ మ్యాచులో గెలవాలంటే యూఏఈ 20 ఓవర్లలో 147 రన్స్ చేయాలి. UAE గెలుస్తుందని అనుకుంటున్నారా? కామెంట్ చేయండి.