News November 26, 2024

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో వరుసగా రెండో రోజు బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,200 తగ్గి రూ.70,800కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,310 తగ్గడంతో రూ.77,240 పలుకుతోంది. కేజీ వెండి ధర ఏకంగా రూ.2,500 తగ్గి రూ.98,000కు చేరింది. 9 రోజుల తర్వాత సిల్వర్ రేటు రూ.లక్ష దిగువకు పడిపోవడం గమనార్హం.

Similar News

News November 6, 2025

వరల్డ్ కప్ విజేతలకు కార్లు గిఫ్ట్ ఇవ్వనున్న TATA

image

మహిళల ప్రపంచకప్‌ గెలిచిన భారత క్రికెట్ జట్టుకు టాటా మోటార్స్ శుభవార్త చెప్పింది. త్వరలో విడుదల కానున్న Tata Sierra SUV మొదటి బ్యాచ్‌లోని టాప్ఎండ్ మోడల్‌ను జట్టులోని ప్రతి సభ్యురాలికి బహుమతిగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. WC విజేతలు & రీఎంట్రీ ఇస్తున్న లెజెండరీ సియెర్రా రెండూ పట్టుదల, ధైర్యం, స్ఫూర్తికి ప్రతీకలని టాటా మోటార్స్ కొనియాడింది. కాగా ఈ కారు నవంబర్ 25న లాంచ్ కానుంది.

News November 6, 2025

ఏపీ న్యూస్ అప్డేట్స్

image

*ప్రజా సమస్యలపై YS జగన్ మరోసారి పాదయాత్ర చేస్తారని మాజీ మంత్రి పేర్ని నాని వెల్లడి. *పత్తి రైతులను ఆదుకునేందుకు సహకరించాలని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్‌కు మంత్రి అచ్చెన్నాయుడు లేఖ. తడిసిన, రంగుమారిన పత్తిని తగిన ధరకు కొనాలని విజ్ఞప్తి. *ఈగల్ వ్యవస్థను స్థాపించాక రాష్ట్రంలో గంజాయి సాగు లేకుండా చేశామని మంత్రి అనిత వెల్లడి. ‘డ్రగ్స్ వద్దు బ్రో’ నినాదాన్ని స్కూలు స్థాయిలోకి తీసుకెళ్తున్నామని ప్రకటన.

News November 6, 2025

చేతులు మెరిసేలా..

image

కొందరిలో ముఖం ప్రకాశవంతంగానే ఉన్నా.. చేతులు మాత్రం జీవం కోల్పోయినట్లుగా తయారవుతాయి. దీనికోసం ఉప్పుతో తయారుచేసిన స్క్రబ్‌ని ఉపయోగిస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. కొద్దిగా ఉప్పులో లావెండర్ నూనె కలిపి దాన్ని చేతులకు రాసుకోవాలి. పదినిమిషాల తర్వాత మృదువుగా రుద్దుతూ క్లీన్ చేసుకోవాలి. ఈ చిట్కాను వారానికి రెండుసార్లు పాటిస్తే చేతులపై చేరిన మృతకణాలు, మురికి తొలగిపోయి మృదువుగా మారతాయి.